Tuesday, July 22, 2025
E-PAPER
Homeకరీంనగర్ప్రజా ఆరోగ్యానికి ప్రభుత్వం ప్రాధాన్యత: ఆది శ్రీనివాస్..

ప్రజా ఆరోగ్యానికి ప్రభుత్వం ప్రాధాన్యత: ఆది శ్రీనివాస్..

- Advertisement -

నవతెలంగాణ – రుద్రంగి
ప్రజల ఆరోగ్యానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత నిస్తుందని వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. ఆయన రుద్రంగి మండలకేంద్రానికి చెందిన తొమ్మిది మంది లబ్ధిదారులకు 4లక్షల 30 వేల విలువగల సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలోనే తెలంగాణ రాష్ట్రం మెడిక‌ల్ హ‌బ్‌గా మారిందన్నారు. వైద్యారోగ్య రంగంలో తెలంగాణ రాష్ట్రం సాధిస్తున్న ప్ర‌గ‌తి,ఇత‌ర రాష్ట్రాల‌కు స్ఫూర్తిదాయ‌కంగా మారిందని రాష్ట్రానికి ముఖ్య‌మంత్రిగా రేవంత్‌రెడ్డి బాధ్య‌త‌లు చేప‌ట్ట‌గానే రాజీవ్ ఆరోగ్య‌శ్రీ ప‌రిమితిని రూ.5 ల‌క్ష‌ల నుంచి రూ.10 ల‌క్ష‌ల‌కు పెంచి ప్ర‌జా ఆరోగ్య భ‌ద్ర‌త‌పై ప్ర‌భుత్వానికున్న చిత్త‌శుద్ధిని చాటుకున్నారని తెలిపారు.

మన ప్రాంతంలో వివిధ ఆరోగ్య సమస్యలతో చికిత్స తీసుకున్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వార, ఎల్ఓసి ల ద్వారా ఇప్పటి వరకు 20 కొట్లు పై చిలుకు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. చెక్కులు మాంజరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, సహకరించిన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు లబ్ధిదారులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చెలుకల తిరుపతి, మాజీ జడ్పిటిసి గట్ల మీనయ్య, మాజీ సర్పంచ్ తర్రె ప్రభలత మనోహర్, గ్రామశాఖ అధ్యక్షుడు సామ మోహన్ రెడ్డి, బీసీసెల్ అధ్యక్షుడు గండి నారాయణ, ఎర్రం గంగ నర్సయ్య, తర్రె లింగం, గడ్డం శ్రీనివాస్, పల్లి గంగధర్, గండి అశోక్, పిడుగు లచ్చిరెడ్డి, గుగ్గిళ్ల వెంకటేష్, సుర యాదయ్య, పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -