Tuesday, July 22, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక బోనాలు

సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక బోనాలు

- Advertisement -

ప్రెస్టేజ్ హాస్పిటల్లో బోనాలు
నవతెలంగాణ – కంఠేశ్వర్ 

సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేది బోనాలు అని ప్రెస్టేజ్ హాస్పిటల్ ప్రముఖ క్రిటికల్ కేర్ వైద్యులు డాక్టర్ ప్రతిమ రాజ్  అన్నారు. ఈ మేరకు సోమవారం నగరంలోని ప్రెస్టేజ్ హాస్పిటల్ ఆవరణంలో సంస్కృతీ సంప్రదాయాలకు నిలువుటద్దంగా నిలిచే బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు.డప్పులతో బోనాలు ఎత్తుకొని నృత్యాలు చేస్తూ సందడి చేశారు. మహిళలు భక్తి శ్రద్ధలతో అమ్మ వారికి బోనాలు సమర్పించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఆడపడుచులకు తాంబూళం అందజేసి ఒకరికి ఒకరు పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రతిమరాజ్ మాట్లాడుతూ..నిజామాబాద్ జిల్లా ప్రజల సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని, మొక్కులు తీర్చుకున్నారు.

జిల్లా ప్రజలు సుభిక్షంగా ఆనందోత్సహాల మధ్య ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని అన్నారు.జిల్లా ప్రజలు సుభిక్షంగా ఆనందోత్సహాల మధ్య ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని అన్నారు. ప్రతి సంవత్సరం బోనాల పండగ నిర్వహించడం ఎంతో శుభ సూచకమని అమ్మవారి దయ వివిధ విభాగాలలో పనిచేస్తున్న సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు, అవరోధాలు లేకుండా ఎలాంటి మహమ్మారిలు రాకుండా చూడాలని కోరారు. సమృద్ధిగా వర్షాలు కురిసి సిరిసంపదలతో విరజిల్లాలని కోరుతూ అమ్మవారికి బోనాలను సమర్పించుకోవడం జరిగిందని అన్నారు. దేశ రైతులు, సైనికుల తో పాటు ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని అందులో మనం ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ ఇన్చార్జిలు షేక్ మోయిన్, కాశిఫ్, మహేష్, ఆస్పత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -