Tuesday, July 22, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఏఐసిసి అధ్యక్షునికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన నాయకులు

ఏఐసిసి అధ్యక్షునికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన నాయకులు

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్
ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున కరిగే పుట్టినరోజు సందర్భంగా జుక్కల్ మండలం సీనియర్ కాంగ్రెస్ నాయకులు బెంగళూరు వెళ్లి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ఈ విషయం వాట్సాప్ స్టేటస్ లో చూసిన ఇతర నాయకులకు మండలంలో ఇట్టి విషయంపై చర్చనీయాంశంగా సంతరించుకుంది. వెళ్లిన నాయకులంతా కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎమ్మెల్యే నుండి విడిపోయి అభివృద్ధి పనులకు దూరంగా ఉంటూ వస్తున్నారు . గత కొంతకాలంగా మండలంలో కాంగ్రెస్ అంతర్గత విభేదాలు ఏర్పడడం పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు . ఎమ్మెల్యే కొత్తగా ఎన్నికైన సందర్భంగా పార్టీకి , పార్టీ చేస్తున్న కార్యక్రమాలకు దూరంగా ఉంటు వస్తున్నారు.

ప్రస్తుతం ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడికి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూన్నామనే అనే కారణంతో వెళ్ళినప్పటికీ మండలంలో. మరో రకంగా చర్చ కొనసాగుతుంది . రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ తడాఖా చూయించాలని కాంగ్రెస్ పార్టీకి రెబల్ గా ఉన్న వీరందరూ ఒక సమూహంగా ఏర్పడి రాబోయే ఎన్నికల తమ మనుషుల్ని ఎన్నికల పోటీలో దించాలని ప్రయత్నాలు కొనసాగుతున్నాయని మండలంలో చర్చ జరుగుతుంది. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మల్లేష్ మల్లికార్జున్ ఖర్గేకు గారికి కలిసిన వారిలో జుక్కల్ మండలం వజ్రఖండి గ్రామం తాజా మాజీ సర్పంచ్ సంజీవ్ పటేల్, పెద్ద ఏడ్గి మాజీ సర్పంచ్ , విండో డైరెక్టర్ పెద్దగుల్లా విట్టల్ పటేల్ , మాజీ ఎంపీపీ సిద్ధాపూర్ లక్ష్మణ్ పటేల్, రైతు నాయకులు ఉమాకాంత్ పటేల్ తదితరులు ఉన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -