నవతెలంగాణ – కాటారం
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారంలో దళితబందు సాధన సమితి జిల్లా అధ్యక్షులు నముండ్ల సంపత్ మహారాజ్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. రెండో విడుత దళిత బందు నిధులు వెంటనే విడుదల చేయాలని, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని పథకాలు అమలు చేస్తున్నామని చెబుతుంది కానీ దళిత బందు పథకాన్ని కొనసాగిస్తామని, లేదా అంబేద్కర్ అభయహస్తం ఇస్తామనీ కానీ స్పష్టత ఇంతవరకు ఇవ్వలేదని, దీనిని బట్టి ప్రభుత్వం దళితులపై వివక్ష చూపుతుందనీ స్పష్టంగా అర్ధం అవుతుందని తెలిపారు. అంతేగాక ఫ్రీజింగ్ లో ఉన్న రెండో విడుత దళిత బందు నిధులు స్థానిక సంస్థల ఎన్నకల లోపు వెంటనే విడుదల చేయాలని, మంథని నియోజకవర్గం లో కోట్ల రూపాయల ఇసుక ద్వారా ఆదాయం ప్రభుత్వానికి వస్తుందనీ అందులో నుండి 40 కోట్లు విడుదల చేసి మా దళిత బందు లబ్ధిదారులను ఆదుకోవాలని, లేనిపక్షంలో దళిత బందు సాధన సమితి ఆధ్వర్యంలో దళితుల ను ఐక్యం చేసి పెద్ద ఎత్తున, ధర్నా, రాస్తరోకో నిర్వహిస్తామని, దానికి ప్రభుత్వమే పూర్తి బాద్యత వహించాల్సి ఉంటుందన్నారు.అంతేగాక మంథని నియోజకవర్గం లో దళితుల పై అనేక దాడులు జరుగుతున్నాయనీ, దళితులు వివక్ష తో పాటు, అన్యాయాని గురౌతున్నారని, వెంటనే దళితుల పై దాడులు ఆపాలన్నారు. ఈ కార్యక్రమం లో దళిత బందు సాధన సమితి సభ్యులు పాల్గొన్నారు.
దళితబందు ఫ్రీజింగ్ నిధులు వెంటనే విడుదల చేయీలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES