నవతెలంగాణ -పరకాల
ఎఐసిసి అధ్యక్షులు మల్లికార్జున కార్గే క్రమశిక్షణ కలిగిన నేతని పరకాల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొయ్యడ శ్రీనివాస్ కొనియాడారు. ఎమ్మెల్యే రేవురి ప్రకాష్ రెడ్డి ఆదేశాల మేరకు సోమవారం పరకాల పట్టణ కేంద్రంలో ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.మల్లికార్జున్ కర్గే కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తూ ప్రజాసేవకు అంకితమై ఇందిరా గాంధీ కుటుంబంలో కుటుంబ సభ్యుడిగా పేరున్న మహానేతన్నారు.మల్లికార్జున కర్గే దేశంలో నరేంద్ర మోడీ పాలనను దేశ ప్రజల కోసం పార్లమెంటులో గలమెత్తి దేశ ప్రజలందరికి సంక్షేమ పథకాలు అందాలని ప్రత్యేకంగా రాహుల్ గాంధీకి తోడుగా ఉంటూ కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపిస్తున్నాడన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొని వారు సమన్వయ కమిటీ సభ్యులు ఎండి రంజాన్ అలీ, పసుల రమేష్, వైస్ ప్రెసిడెంట్ ఒంటేరు శ్రవణ్ కుమార్, గూడెల్లి సదన్ కుమార్, చెరుపల్లి మొగిలి, సుదమల్ల కిషోర్, గుట్ట రమేష్, గడ్డం శివ, సదానందం, రాజేష్ తదితరులు పాల్గొన్నారు
క్రమశిక్షణ కలిగిన నేత మల్లికార్జున కార్గే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES