Tuesday, July 22, 2025
E-PAPER
Homeతాజా వార్తలువిఎస్ అచ్యుతానందన్ మచ్చలేని నేత: సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు

విఎస్ అచ్యుతానందన్ మచ్చలేని నేత: సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు

- Advertisement -

నవతెలంగాణ హైదరాబాద్: కేరళ మాజీమంత్రి విఎస్ అచ్యుతానందన్ మరణం విప్లవోద్యమానికి తీరని లోటు అని సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు అన్నారు. సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఎంబీ భవన్ లో జరిగిన సంస్మరణ సభలో రాఘవులు మాట్లాడారు. విఎస్ అచ్యుతానందన్ ది మచ్చలేని వ్యక్తిత్వం అని అన్నారు. కేరళ ప్రజాతంత్ర ఉద్యమాల్లో ఆయనది కీలక పాత్ర. ఎమర్జెన్సీ కాలంలో తీవ్ర నిర్బంధాన్ని ఎదుర్కొన్నారని తెలిపారు.

సభలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు టి.సాగర్, పి.ప్రభాకర్, బండారు రవికుమార్, రాష్ట్ర కమిటీ సభ్యులు టి.స్కైలాబ్ బాబు, బాబురావు , ఆశయ్య, ఉడతా రవీంద్ర, సీఐటీయూ నేతలు రాజారావు, వంగూరి రాములు, రైతుసంఘం నేత అరిబండి ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -