– వాణిజ్య ఒప్పంద చర్చలు కొనసాగింపు
న్యూఢిల్లీ : ద్వైపాక్షిక వాణిజ్య చర్చల్లో భాగంగా అమెరికా బృందం ఆగస్టులో భారత్‌కు రానుంది. ఇప్పటికే ఐదు దశల్లో చర్చలు జరగ్గా.. తదుపరి రౌండ్ చర్చల కోసం యూఎస్ అధికారులు రానున్నారని సోమవారం ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. గత వారం వాషింగ్టన్‌లో భారత్, అమెరికా బృందాలు ఐదో రౌండ్ చర్చలను ముగించాయి. భారత్ తరపున వాణిజ్య శాఖ స్పెషల్ సెక్రెటరీ రాజేశ్ అగర్వాల్, అమెరికా తరపున అసిస్టెంట్ యూఎస్ ట్రేడ్ రిప్రెజెంటేటివ్ బ్రెండన్ లించ్ చర్చల్లో పాల్గొన్నారు. ఆగస్టు 1వ తేది నాటికే ఇరు దేశాలు తాత్కాలిక వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ పలు అంశాలపై ఇరు దేశాలు పట్టుబట్టడంతో ఈ ఒప్పందం ఆలస్యం అవుతోంది. భారత్‌లో తమ జన్యు మార్పిడి (జీఎం) విత్తనాలు, పాడి పరిశ్రమలో పాలు, పాల ఉత్పత్తులను అనుమతించాలని అమెరికా తీవ్రంగా డిమాండ్ చేస్తోంది. మరోవైపు భారత్ వాహన, స్టీల్, ఆల్యూమినియం ఉత్పత్తులపై సుంకాలను తగ్గించాలని పట్టుబడుతోంది.
ఆగస్టులో భారత్‌కు అమెరికా బృందం
- Advertisement -
- Advertisement -