– మారుతి సుజుకి సీఈఓ వెల్లడి
గూర్‌గావ్ : దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ (ఎంఎస్‌ఐఎల్) ఉదరుపూర్‌లో తన 5,500వ సర్వీస్ టచ్ పాయింట్‌ను ప్రారంభించింది. దేశవ్యాప్తంగా 2,764 నగరాల్లో 40,000 సర్వీస్ బేలతో సేవలు అందిస్తోన్నట్టు పేర్కొంది. ఆర్థిక సంవత్సరం 2024-25లో 2.7 కోట్ల వాహనాలకు సర్వీస్‌ను అందించినట్టు ఆ కంపెనీ ఎండీ, సీఈఓ హిసాషి తకేచి తెలిపారు. 2025-26లో కొత్తగా 500 టచ్‌పాయింట్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఇప్పటికే 91 కొత్త టచ్ పాయింట్లను అందుబాటులోకి తెచ్చామన్నారు. తమ వినియోగదారులకు సమీపంలో సౌకర్యవంతమైన, విశ్వసనీయమైన సర్వీస్ అందించడమే తమ లక్ష్యమని హిసాషి తకేచి తెలిపారు.
500 కొత్త టచ్ పాయింట్లను తెరుస్తాం
- Advertisement -
- Advertisement -