Tuesday, July 22, 2025
E-PAPER
Homeజాతీయంనేడు విద్యాసంస్థలకు సెలవు..మూడు రోజుల పాటు సంతాప దినాలు

నేడు విద్యాసంస్థలకు సెలవు..మూడు రోజుల పాటు సంతాప దినాలు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : దిగ్గజ కమ్యూనిస్టు నాయకుడు, కేరళ మాజీ ముఖ్యమంత్రి వి.ఎస్‌.అచ్యుతానందన్‌ కన్నుమూసిన విషయం తెలిసిందే. గత నెల 23న గుండెపోటుతో ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చేరగా.. ఆయన ఆరోగ్య పరిస్థితి మరింతగా క్షీణించడంతో సోమవారం తుదిశ్వాస విడిచారు. దీంతో కేరళలోని కమ్యూనిస్టు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేడు కేరళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది. అంతేగాకుండా.. మూడు రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, 2006 నుంచి 2011 వరకు ఆయన కేరళకు సీఎంగా పనిచేసిన విషయం తెలిసిందే. 1923 అక్టోబరు 20న కేరళలో వెనకబడిన ఓ నిరుపేద కుటుంబంలో జన్మించిన అచ్యుతానందన్‌.. లెనిన్‌, స్టాలిన్‌, మావోల జీవితాలతో పాటు.. ప్రపంచ కమ్యూనిస్టు చరిత్రలో అనేక కీలకఘట్టాలను వి.ఎస్‌.అచ్యుతానందన్‌ చూశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -