Wednesday, July 23, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్క్లస్టర్స్ స్థాయి ఆటల పోటీలకు సిద్దమైన జవహర్ నవోదయ చలకుర్తి

క్లస్టర్స్ స్థాయి ఆటల పోటీలకు సిద్దమైన జవహర్ నవోదయ చలకుర్తి

- Advertisement -
  • – పోటీలలో పాల్గొననున్న 200 మంది విద్యార్థిని, విద్యార్థులు, అంగ, రంగ వైభవంగా నేడు ప్రారంభం
    నవతెలంగాణ-పెద్దవూర

    నల్గొండ జిల్లా పెద్దవూర మండలం చలకుర్తి క్యాంపు జవహర్ నవోదయ పాఠశాల లో  ఈ నెల23 నుంచి 25 వ తేదీవరుకు క్లస్టర్స్ స్థాయి  అటలపోటీలు జరుగనున్నాయి. మూడు రోజులపాటు క్రీడాభిమానులకు చలకుర్తి క్యాంపు నవోదయ వేదిక కానుంది. అత్యుత్తమ విద్యతోపాటు క్రీడలకు సముచిత ప్రాధాన్యతనిస్తూ విద్యార్థుల సర్వతో ముఖాభివృద్ధికి బాటలు వేస్తున్న స్థానిక నవోదయ వేదికగా అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. తెలంగాణలోని అన్ని నవోదయ విద్యాలయాల అథ్లెటిక్స్  క్రీడాకారులు ప్రాతినిధ్యం వహిస్తారు. అథ్లెటిక్స్ లో 9 జిల్లాల క్రీడాకారులంతా 96 మంది,అందులో 57 మంది అబ్బాయిలు,39 మంది అమ్మాయిలు, మంగళవారం సాయంత్రం లోపుగా చలకుర్తి క్యాంప్ కు చేరుకోనున్నారు. వివిధ
    తెలంగాణ జిల్లాల నుండి తరలివచ్చిన క్రీడాకారులు, ఎస్కార్ట్ టీచర్లతో నవోదయ సందడిగా మారబోతోంది. ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా పెద్దవూర మండల విద్యా శాఖాధికారి రాములు హాజరవుతున్నారు.

  • ప్రతిష్టాత్మకంగా అథ్లెటిక్స్ నిర్వహణ అవకాశం మాకు దక్కడం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాం. ఫిజికల్ టీచర్లు, టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ అందరి సహకారంతో ఆటలను జయప్రదం చేయనున్నారు. నిష్ణాతులైన రెఫరీలతో పోటీలు నిర్వ హిస్తున్నారు. క్రీడాకారులు క్రీడాస్ఫూర్తిని చాటుతూ పోటీలలో పాల్గొనబోతున్నారు. ఈ క్లస్టర్ లో సెలెక్ట్ అయిన విద్యార్థులు 27 వ తేదీ సాయంత్రం 25 మంది అబ్బాయిలు, 25 మంది అమ్మాయిలు కర్ణాటక రాష్ట్రం జరుగబోయే రీజినల్ మీట్ లో పాల్గొంటారు. విద్యార్థుల మధ్య  నైపుణ్యాలను ప్రదర్శించడానికి, ఇతర పాఠశాలల విద్యార్థులతో కలిసిమెలిసి ఉండటానికి మరియు క్రీడాస్ఫూర్తిని పెంపొందించుకోవడానికి ఒక వేదికగా ఈ పోటీలు జరుగ నున్నాయి. 
  • నవోదయ విద్యాలయ సమితి  ప్రతి సంవత్సరం పాఠశాల స్థాయి, క్లస్టర్ స్థాయి, ప్రాంతీయ స్థాయి మరియు జాతీయ స్థాయిలో వివిధ క్రీడలు మరియు ఆటల కార్యకలాపాలను నిర్వహిస్తుంది. క్లస్టర్ పోటీలలో భాగంగా, విద్యార్థులు కబడ్డీ, వాలీబాల్, క్రికెట్, ఫుట్‌బాల్, అథ్లెటిక్స్ వంటి వివిధ క్రీడలలో పోటీపడతారు.  అలాగే, విద్యార్థులు క్విజ్, డిబేట్, డ్రాయింగ్, పెయింటింగ్ వంటి సాంస్కృతిక మరియు విద్యా సంబంధిత కార్యక్రమాలలో కూడా పాల్గొంటారు. ఈ పోటీలు విద్యార్థులకు వారి ప్రతిభను ప్రదర్శించడానికి, ఇతర పాఠశాలల విద్యార్థులతో పరిచయాలు ఏర్పరచుకోవడానికి  ఈ పోటీలు విద్యార్థులలో ఆత్మవిశ్వాసం, జట్టుపని మరియు నాయకత్వ లక్షణాలను పెంపొందించడానికి సహాయపడతాయి. 
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -