నవతెలంగాణ- హైదరాబాద్: పహల్గాం కేసును ఎన్ఐఏ దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ ఘటనపై విచారణను వేగవంతం చేసింది. ఇటీవలె క్లూస్ టీంతో బైసరల్ లోయను, ఆయా పరిసర ప్రాంతాలను NIA క్షుణ్ణంగా పరిశీలించింది. సేకరించిన కీలక ఆధారాలను ఫోరెన్సిక్ నిపుణులకు పంపించారు అధికారులు. అంతేకాకుండా ఏప్రిల్ 22న ఉగ్రదాడి జరిగిన సమయంలో ఉన్న ప్రత్యక్ష సాక్షులను కూడా అధికారులు విచారించారు. తాజాగా మరోసారి జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) డైరెక్టర్ జనరల్ సదానంద్ జమ్మూకశ్మర్‌లోని పహల్గాంకు చేరుకున్నారు. దీంతో మరోసారి పహల్గాంలోని బైసరన్ లోయ పరిశీలించి.. ఘటనపై సమగ్ర రిపోర్టు తయారు చేయనున్నారు.
- Advertisement -