Wednesday, July 23, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కమ్యూనిస్టు యోధునికి కడసారి నివాళులర్పించిన సీపీఐ(ఎం) శ్రేణులు

కమ్యూనిస్టు యోధునికి కడసారి నివాళులర్పించిన సీపీఐ(ఎం) శ్రేణులు

- Advertisement -
  • – మీరు చేసిన త్యాగం పోరాటం మరువలేనిది
    – సిపిఎం జిల్లా కార్యదర్శి వర్ధం పర్వతాలు
    నవతెలంగాణ – తిమ్మాజిపేట
  • భారత కమ్యూనిస్టు పార్టీ మార్సిస్టు కేరళ మాజీ సీఎం కమ్యూనిస్టు దిగ్గజ విఎస్ అచ్చితానందన్ సోమవారం మధ్యాహ్నం కేరళ రాష్ట్రం తిరువనంతపురంలో తుది శ్వాస విడిచిన పోరాట యోధునికి సీపీఐ(ఎం) పార్టీ నాగర్ కర్నూల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తాలో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా కడసారి ఘనంగా నివాళులు అర్పించరు. ఈ సందర్భంగా వర్ధన్ పర్వతాలు మాట్లాడుతూ కేరళ రాష్ట్రంలో అత్యంత ప్రజా ధరన కలిగిన నేతలలో ఒకరిగా రాజీలేని పోరాట నేతగా కమ్యూనిస్టు యోధుడు కామ్రేడ్ వీఎస్ అచ్యుతానందన్ అని ఆయన మరణం భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటు అని ఆయన ఈ సందర్భంగా అన్నారు.
  • నిరుపేద అతి సాధారణ కల్లుగీత కార్మిక కుటుంబంలో 1923 అక్టోబర్ 20న అచ్చుతానందన్ జన్మించి 11 ఏళ్ల వయసులో తండ్రి మరణించిన బాల్యంలోనే కష్టాలను అనుభవిస్తూ 17 ఏళ్ల వయసులో వామపక్ష ఉద్యమంలో అడుగుపెట్టిన అచ్యుతానందన్ కేరళ రాష్ట్రంలోనే ఒక మాస్ లీడర్ గా ఎదిగి సిపిఎం పార్టీ బలోపేతానికి పార్టీ ఎదుగుదలకు పార్టీ అధికారంలోకి రావడానికి తను పోషించిన పాత్ర ఎనలేనిదని ఆయన సందర్భంగా అన్నారు. 1946 త్రావెన్ కోర్ లో జరిగిన సాయుధ తిరుగుబాటు పాల్గొని నాలుగేళ్లు జైలు శిక్షకు గురయ్యారు 1964లో సిపిఐ నుంచి ఒక వర్గం చీలిపోయి సిపిఎం గా ఏర్పాటు చేసింది అందులో ప్రధానంగా సిపిఎం వ్యవస్థాపక నేతల్లో విఎస్ అచ్చుతానందన్ ఒకరు 1965 నుంచి 2016 మధ్యకాలంలో కేరళ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీకి ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి తిరుగులేని నాయకుడిగా పేరు పొందారు.
  • అవినీతి అక్రమాలకు అనైతకు ఏమాత్రం సహించని వి ఎస్ అచ్యుతానందన్ పార్టీలో జరుగుతున్న విషయాల పైన తీవ్రంగా మందలించేవారు. 82 ఏళ్ల వయసులో తొలిసారిగా ఆయన కేరళ ముఖ్యమంత్రిగా పదవి చేపట్టారు ఆయన పదవి చేపట్టనున్నట్టు నుంచి కేరళలో ఆర్థిక సంస్కరణలో విఎస్ తీవ్రంగా వ్యతిరేకించేవారు. కేరళలో కోకో కోలా ప్లాంట్ ఏర్పాటుకు వ్యతిరేకంగా నడిపిన ఉద్యమం బాగా పేరుపొందింది దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ జీవితాన్ని గడిపిన ఆయన చివర వరకు నమ్మిన సిద్ధాంతాలకు ప్రజల సంక్షేమానికి కట్టుబడి పని చేశారని అటువంటి మహానేతను కోల్పోవడం పార్టీకి తీరనిలోటు అని ఆయన సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన నమ్మిన సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజా పోరాటాలను ఉదృతం చేయాలని ఆయన సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్ శ్రీనివాసులు జిల్లా కమిటీ సభ్యులు నరసింహ, పొదిల రామయ్య మండల కమిటీ సభ్యులు సురేష్ నాయకులు మధు, సుభాష్, మల్లికార్జున్, లక్ష్మయ్య, మురళి, నరసింహ, సత్యం, చారి, కురుమూర్తి, వెంకటయ్య, కృష్ణయ్య, బాలయ్య, రాఘవేంద్ర చారి తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -