నవతెలంగాణ- హైదరాబాద్: రిజర్వేషన్ పద్ధతిని RSS బైబర్త్ నుంచి వ్యతిరేకిస్తుందని కాంగ్రెస్ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే అన్నారు. ఆ సంస్థ అనుబంధ సంఘాలు నెహ్రుపై అనవసర ఆరోపణలు చేస్తున్నాయని, బడుగు బలహీలన వర్గాలకు వర్తించే రిజర్వేషన్లు ఎత్తివేయాలని RSS, దాని అనుబంధ సంఘాలు కుట్రలకు తెరలేపాయని ఆరోపించారు. కొంతమంది రిజర్వేషన్లు వ్యతిరేస్తున్నారని, కానీ దాని కాంగ్రెస్ పార్టీకి అపాదిస్తున్నారని మండిపడ్డారు. రిజర్వేషన్లకు కాంగ్రెస్ వ్యతిరేకమైతే..కేంద్రానికి తానెందుకు లేఖ రాస్తానని ఆయన గుర్తు చేశారు. తాము లేక రాసినప్పడు..కేంద్రం సపోర్టు చేయలేదని,కానీ ప్రస్తుత నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తుందని, దేశ వ్యాప్తంగా కులగణనకు తమ సహకారాన్ని కేంద్ర ప్రభుత్వానికి అందిస్తామని కర్నాటక మీడియా సమావేశంలో ఆయన స్పష్టం చేశారు. రిజర్వేషన్లు అంశాన్ని, కులగణన వ్యవహారాన్ని కాంగ్రెస్ రాజకీయా చేస్తుందని RSS ఇటీవల ఆరోపించింది. తాజాగా ఆయన RSSకు కౌంటర్ ఇచ్చారు.
RSSకు మల్లిఖార్జున ఖర్గే కౌంటర్..
- Advertisement -
RELATED ARTICLES