Wednesday, July 23, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిపశ్చిమాసియా పరిణామాలు - అసలు దోషి అమెరికానే!

పశ్చిమాసియా పరిణామాలు – అసలు దోషి అమెరికానే!

- Advertisement -

అమెరికా, కొన్ని నాటో దేశాల అండదండలతో పాలస్తీనాలోని గాజాతో సహా అన్ని ముఖ్య ప్రాంతాలపైన గత ఇరవై నెలలుగా ఇజ్రాయిల్‌ అత్యంత ఘోరమైన మారణకాండను సాగిస్తోంది. హమాస్‌ తమ దేశంపై చేసిన దాడిని సాకుగా ఇజ్రాయిల్‌ చూపుతోంది. హమాస్‌ జరిపిన అమానుష దాడిని ఆనాడు ప్రపంచం మొత్తం ఖండించింది. ఇజ్రాయిల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు యుద్ధోన్మాదానికి ప్రతీకగా మారిపోయాడు. ఆయన అనుసరిస్తున్న దుర్మార్గమైన వైఖరి పట్ల స్వంత దేశంలోనే తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.ఇప్పటికే సుమారు 59వేల మందికి పైగా పాలస్తీనా పౌరులు మరణిం చారు. వీరిలో వేలాదిమంది చిన్నారులు, మహిళలు ఉన్నారు. ఐక్యరాజ్యసమితి చేసిన పలు తీర్మా నాలను ఇజ్రాయిల్‌ ఏ మాత్రం లెక్క చేయకుండా పాలస్తీనాలోని నివాసిత ప్రాంతాలపైన బాంబులు కుమ్మరిస్తోంది. కానీ, ప్రపంచ ప్రజానీకం పాలస్తీనాకు పెద్దఎత్తున తమ సంఘీభావం తెలిపింది. ఎన్నో ప్రాంతాల్లో యూనివర్సిటీ విద్యార్థులు రోడ్ల మీదకు వచ్చి ఇజ్రాయిల్‌ సాగిస్తున్న దారుణ అణచివేతను గట్టిగా నిరసించారు.

పశ్చిమాసియాలోని ఇటీవలి పరిణామాలు ప్రపంచ దేశాలకు ఆందోళన కలిగిస్తున్నాయి. వీటి వెనుక అమెరికా పాత్ర స్పష్టంగా కనిపిస్తోంది. లెబనాన్‌, సిరియా దేశాలపై విమాన దాడులతో ఇజ్రాయిల్‌ విరుచుకుపడింది. యెమెన్‌ దేశంలోని ఓడ రేవులు, విద్యుత్‌ ప్లాంట్ల పైన దాడులు చేసింది. అమెరికాతో అంటకాగుతూ ఇజ్రాయిల్‌ పేట్రేగిపోతోంది. ప్రపంచ దేశాలకు ప్రజాస్వామ్యం గురించి, మానవ హక్కుల గురించి నీతిసూత్రాలు వల్లించే అమెరికా, ఇజ్రాయిల్‌ సాగిస్తున్న ఘోరమైన ఊచకోతను ఏ విధంగానూ కట్టడిచేయకపోగా, పాలస్తీనా అమాన వీయ దాడులకు అన్ని విధాలా సహాయపడుతోంది. ఇజ్రాయిల్‌ కు ఆర్థిక వనరులను సమకూరుస్తూ, యుద్ధ సామగ్రిని అమ్ము తోంది. ఇరాన్‌, ఇజ్రాయిల్‌ దేశాల మధ్య జరిగిన యుద్ధ ప్రభావం అనేక దేశాలపై పడింది. ఒకపక్క అణుశక్తిని కలిగి ఉన్న అమెరికా, ఇజ్రాయిల్‌ వంటి దేశాలు మరో ప్రక్క ఇరాన్‌ మాత్రం అణు బాంబులను తయారు చేయ డానికి వీల్లేదని నీతులు వల్లించడం పెద్ద విచిత్రంగా ఉంది. ఐక్యరాజ్య సమితిలో తనకున్న వీటో అధికారాన్ని సైతం అమెరికా ఇప్పటికే పలు దఫాలు దుర్వినియోగం చేసింది.ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాలకు అమెరికా అనుసరిస్తున్న దుందుడుకు వైఖరే ముఖ్య కారణం.

ప్రపంచ శాంతికి ప్రధమ శత్రువు, పెద్ద అవరోధం అమెరికానే. తమ దేశ రక్షణ రంగ వ్యాపారం కోసం, లాభాపేక్షతో వివిధ దేశాల మధ్య ఉద్రిక్తతలు సఅష్టించి అమెరికా ఆయుధాలు అమ్ముకుంటోంది. రష్యా నుండి ఉత్పత్తులు కొనుగోలు చేస్తే 500 శాతం సుంకాలు విధిస్తామని, బ్రిక్స్‌ దేశాలపై పది శాతం అదనపు టారిఫ్‌ విధిస్తామని ట్రంప్‌ బెదిరింపులకు పాల్పడుతున్నాడు. జి7, షాంఘై, బ్రిక్స్‌, నాటో వం టివి ఎన్ని కూటములున్నా, అంతర్జాతీయ సదస్సులు అనేకం జరుగుతున్నా ఇజ్రాయిల్‌ను ఒంటరిపాలు చేయడంలో విఫలమ య్యాయి. ప్రపం చానికి ఎటువంటి చక్రవర్తి అవసరం లేదని బ్రెజిల్‌ అధ్యక్షుడు లూలా డ సిల్వా నిర్మొహమా టంగా ప్రకటించడంఒక పెద్ద ఉపశమనంగా భావించాలి. అమెరికా ఆధిపత్యానికి ధీటుగా ప్రపంచం ప్రత్యామ్నాయాన్ని కోరుకుంటున్నదని ఆయన విస్పష్టంగా ప్రకటించాడు.

గత దశాబ్ద కాలంగా మన దేశ ప్రభుత్వం అనుసరి స్తున్న విదేశాంగ విధానం అస్తవ్యస్తంగా మారింది. పాలస్తీనా విషయంలో ఈ వాస్తవం చాలా స్పష్టంగా బహిర్గతమైంది. భారత్‌ ఎల్లప్పుడూ శాంతి, సామరస్యం వైపు గట్టిగా నిలబడిన చరిత్రను కలిగి ఉంది. అమెరికా, ఇజ్రాయిల్‌ జోడీ అవలంబిస్తున్న ఆధిపత్య, అరాచక ధోరణులను ఎప్పటికప్పుడు అడ్డుకోవ డంలో మన దేశం వెనుకబడింది. ఇది ఉద్దేశ పూర్వకంగా తీసుకున్న వైఖరి గానే భావించాలి. ఐక్యరాజ్యసమితి చేసిన పలు తీర్మానాల సందర్భాల్లో మన దేశం పాలస్తీనాకు అండగా నిలబడ లేదు. ఎన్నో దశాబ్దాలుగా మనం అనుసరించిన సాంప్రదా యక విదేశీ విధానాన్ని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం పక్కన పడేసి, అమెరికా కనుసన్నల్లో నడవడం వల్ల మన దేశ గౌరవ, ప్రతిష్టకు భంగం వాటిల్లింది. ఇరాన్‌ పై ఇజ్రాయిల్‌, అమెరికా చేసిన సైనిక దాడిని కూడ మన ప్రభుత్వం ఖండించలేదు. గతంలో ప్రధానమంత్రిగా వాజ పేయి నేతృత్వంలోనున్న ప్రభుత్వం కూడా పాలస్తీనా విష యంలో ఈ విధమైన దుస్సాహస వైఖరిని తీసుకో లేదు.

ఐక్యరాజ్యసమితి తీర్మానాల ప్రకారం పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తించి, ఆ దేశం ఏర్పాటుకు తగిన చర్యలు వెంటనే తీసుకోవాలి. అందుకు భారత్‌ తగిన ప్రయత్నం చేయాలి. పాలస్తీనాను అన్నివిధాలా ఆదుకో వాలి. మానవతా సహాయం అందించాలి. వీటితో పాటు పశ్చి మాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు అవసరమైన అన్ని ప్రయత్నాలు చేయాలి. అమెరికాకు వంత పాడే పద్ధతులను భారత్‌ ఇప్పటికైనా విడనాడాలి.
వి.వి.కే.సురేష్‌
9440345850

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -