Wednesday, July 23, 2025
E-PAPER
Homeజాతీయంభారత సైన్యంలో అమెరికా హెలికాప్టర్లు

భారత సైన్యంలో అమెరికా హెలికాప్టర్లు

- Advertisement -

తొలివిడతగా యూపీలోని హిండన్‌ ఎయిర్‌బేస్‌కు
లక్నో :
అమెరికా నుంచి అత్యాధునిక ఏహెచ్‌ -64 ఈ అపాచీ హెలికాప్టర్లు భారత వాయుసేనకు అందాయి. తొలివిడతలో భాగంగా మూడు అపాచీ హెలికాప్టర్లు ఉత్తర్‌ప్రదేశ్‌లోని హిండన్‌ ఎయిర్‌బేస్‌కు చేరుకున్నాయి. యూఎస్‌ అంతరిక్ష సంస్థ బోయింగ్‌ అమెరికా నుంచి రవాణా విమానంలో వీటిని భారత్‌కు చేర్చింది. ఈ హెలికాప్టర్లను దేశ పశ్చిమ సరిహద్దులకు చేరువలోని రాజస్థాన్‌లోని జోధ్‌పుర్‌లో మోహరించనున్నారు. అపాచీ హెలికాప్టర్ల రాక ఇప్పటికే 15 నెలలు ఆలస్యం కాగా, ఈ ఏడాది చివరిలోగా మరో మూడు రానున్నాయి. గగనతలం నుంచి శత్రుమూకపై ఉరుము లేని పిడుగులా నిప్పులు కురిపించే ఈ హెలికాప్టర్ల చేరికతో భారత రక్షణ వ్యవస్థ మరింత బలోపేతం కానున్నదని అధికారులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -