– తెలంగాణ జాగృతి అధ్యక్షులు, ఎమ్మెల్సీ కవిత
– ఆయన జీవితమంతా పోరాటాలమయం : కె.శ్రీనివాస్
నవతెలంగాణ-కల్చరల్
దాశరథి కృష్ణమాచార్యకు ప్రభుత్వం సరైన గౌరవం ఇవ్వలేదని తెలంగాణ జాగృతి అధ్యక్షులు, ఎమ్మెల్సీ కవిత అన్నారు. నిజాం రాచరిక పాలన నుంచి విముక్తి కోసం కలం పట్టిన దాశరథి కృష్ణమాచార్య శత జయంతి ఉత్సవాలను ప్రభుత్వం ఏడాది అంతా నిర్వహించకపోవటం విచారకరమన్నారు. హైదరాబాద్ తెలుగు విశ్వవిద్యాలయం ఎన్‌టీఆర్ కళా మందిరంలో మంగళవారం తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో దాశరథి కృష్ణమాచార్య శత జయంతి ఉత్సవం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చిన్నగూడూరు అనే మారుమూల గ్రామంలో పేద కుటుంబంలో జన్మించిన దాశరథి తన కలంతో ఉద్యమజ్యోతి రగిలించిన మహానుభావుడు అని అన్నారు. గిరిజనులు, పేదల బాధలను కవితల్లో ఆవిష్కరించారని, నిజాం పాలనలో ఆయనను ఖిల్లా నిజామాబాద్ జైలులో బంధించడం చరిత్రలో మరిచిపోలేని ఘట్టమని తెలిపారు. ఆ జైలు అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని, దాశరథి జ్ఞాపకార్థంగా నిలువెత్తు విగ్రహం కూడా అక్కడ ప్రతిష్టించామని అన్నారు. మాజీ సంపాదకులు, ప్రముఖ జర్నలిస్టు కె.శ్రీనివాస్ మాట్లాడుతూ.. దాశరథి జీవితం అంతా పోరాటాలమయమని అన్నారు. ఆయన కవితా సంపుటి అన్ని వర్గాల ప్రజలకు ముఖ్యంగా యువతకు చేరువ కావాలన్నారు. ప్రముఖ కవి డా.నాలేశ్వరం శంకరం, సాహితీవేత్త డా.అమ్మంగి వేణుగోపాల్ ప్రసంగిం చారు. అనంతరం జరిగిన ‘అగ్నిశిఖ’ కవి సమ్మేళనంలో డా. కందుకూరి శ్రీరాములు, మౌనశ్రీ, మల్లిక్, సంపత్, జయంతి తదితరులు స్వీయ గీతాలను చదివారు.
దాశరథి కృష్ణమాచార్యకు సరైన గౌరవమివ్వని ప్రభుత్వం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES