Thursday, July 24, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంరిజిస్ట్రేషన్‌ ఎందుకు చేయలేదు

రిజిస్ట్రేషన్‌ ఎందుకు చేయలేదు

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట మండలం దేవర్‌యంజాల్‌లో 18 ఎకరాల భూముల రిజిస్ట్రేషన్లను నిరాకరించడంపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు ఇచ్చింది. కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రతివాదులైన రెవెన్యూ, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌, దేవాదాయశాఖల కమిషనర్లతో పాటు జిల్లా రిజిస్ట్రార్‌, సబ్‌రిజిస్ట్రార్‌, సీతారామస్వామి ఆలయాలను ఆదేశించింది. శామీర్‌పేట మండలం దేవర్‌యంజాల్‌లో సర్వే నెం.61/యు, 63/ఎలోని 18 ఎకరాల్లో ప్లాట్ల రిజిస్ట్రేషన్‌ను నిరాకరించడాన్ని సవాలు చేస్తూ వి.ప్రతీష్‌రావు ఇతరులు వేసిన పిటిషన్‌ను జస్టిస్‌ కె.శరత్‌ విచారణ చేపట్టారు. ఇదే అంశంపై గతంలో దాఖలైన పిటిషన్‌తో కలిపి విచారణ చేస్తామని ప్రకటించారు. గత పిటిషన్‌తో జత చేయాలని రిజిస్ట్రీని ఆదేశించారు. విచారణను వచ్చే నెలకు వాయిదా వేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -