Thursday, July 24, 2025
E-PAPER
Homeక్రైమ్బాలికపై లైంగిక దాడి

బాలికపై లైంగిక దాడి

- Advertisement -

– నిందితుడి అరెస్ట్‌
– శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఘటన
నవతెలంగాణ-శంషాబాద్‌

భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్న ఓ బాలికపై వలస కార్మికుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలం రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం పోలీస్‌స్టేషన్‌ ఎదురుగా నేషనల్‌ హైవే బ్రిడ్జి కింద మంగళవారం జరిగింది. స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ కె.బాలరాజు తెలిపిన వివరాల ప్రకారం.. బెంగళూరు జాతీయ రహదారి బ్రిడ్జి కింద పదేండ్ల బాలిక తన కుటుంబ సభ్యులతో కలిసి భిక్షాటన చేస్తూ జీవిస్తున్నది. గుజరాత్‌ రాష్ట్రానికి చెందిన సంజరు అలియాస్‌ ఇర్ఫాన్‌ హుస్సేన్‌(24) కొన్నేండ్ల కిందట బతుకుదెరువు కోసం శంషాబాద్‌కు వలసొచ్చాడు. మద్యం మత్తులో ఉన్న అతడు బ్రిడ్జి కింద నిద్రిస్తున్న బాలికపై తెల్లవారుజామున లైంగిక దాడికి ఒడిగట్టాడు. ఈ దారుణంపై కుటుంబ సభ్యులు, స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఇన్‌స్పెక్టర్‌ బాలరాజు తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అరెస్టు చేశారు. బాలికను ఆస్పత్రికి తరలించి వైద్యపరీక్షలు చేయించారు. లైంగికదాడి జరిగినట్టు వైద్యులు నిర్ధారించారు. నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -