- Advertisement -
వాషింగ్టన్ : అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్)లో డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్‌గా పని చేస్తున్న గీతా గోపీనాథ్ ఆ పదవీ నుంచి వైదొలగనున్నారు. ఆగస్టులో గీతా గోపినాథ్ తన పదవీ నుంచి దిగిపోనున్నట్టు ఐఎంఎఫ్ అధికారికంగా ప్రకటించింది. అనంతరం గీతా గోపినాథ్ తిరిగి హార్వర్డ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా చేరనున్నారు. 2019 అక్టోబర్ నుంచి ఐఎంఎఫ్ చీఫ్ ఎకనామిస్ట్‌గా పని చేస్తున్నారు. 2022 జనవరిలో డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. గీతా స్థానంలో ఆ పదవి చేపట్టే వ్యక్తి ఎవరన్నది త్వరలోనే ప్రకటిస్తామని ఐఎంఎఫ్ పేర్కొంది.
- Advertisement -