Wednesday, July 23, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంగవర్నర్‌తో కొత్తకోట సీతాదయాకర్‌ రెడ్డి భేటీ

గవర్నర్‌తో కొత్తకోట సీతాదయాకర్‌ రెడ్డి భేటీ

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ చైర్‌పర్సన్‌ కొత్తకోట సీతాదయాకర్‌ రెడ్డి రాష్ట్ర గవర్నర్‌ జిష్ణు దేవ్‌ వర్మతో భేటీ అయ్యారు. మంగళవారం హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో సమావేశమైన సందర్భంగా వారు బాలల హక్కుల పరిరక్షణ కోసం కమిషన్‌ తీసుకుంటున్న చర్యలపై చర్చించారు. బాలల హక్కులపై సమాజంలో మరింత అవగాహన పెంచే కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. అణగారిన వర్గాలకు చెందిన చిన్నారుల హక్కుల పరిరక్షణ కోసం ప్రత్యే కంగా శ్రద్ధ పెట్టాల్సిన అవసరాన్ని గుర్తించారు. కమిషన్‌ చేపడుతున్న కార్య క్రమాల పట్ల గవర్నర్‌ అభినందనలు తెలిపారు. ఈ సమావేశంలో మహిళా, శిశు సంక్షేమశాఖ, ఉమెన్‌ సేఫ్టీ వింగ్‌లకు చెందిన సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -