Saturday, September 27, 2025
E-PAPER
Homeతాజా వార్తలుహైదరాబాద్‌లో మరో భారీ అగ్ని ప్రమాదం

హైదరాబాద్‌లో మరో భారీ అగ్ని ప్రమాదం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ఇటీవలే సంగారెడ్డి జిల్లా పాశమైలారం సిగాచీ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం జరిగి.. 44 మృతిచెందిన విషయం తెలిసిందే. ఇది జరిగి నెల కూడా గడవకముందే మరో కంపెనీలో ప్రమాదం జరగడం కలకలం రేపింది. వివరాల్లోకి వేలితే.. దుండిగల్ తండాలోని రాంకీ కంపెనీ లో బుధవారం ఉదయం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కెమికల్ రియాక్ట్ అవ్వడంతో మంటలు వ్యాపించినట్లు గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన స్థానికులు, కార్మికులు ప్రాణ భయంతో పరుగులు తీశారు. ఎలాంటి ప్రాణ నష్టం జరుగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -