Friday, May 2, 2025
Homeజిల్లాలుఊరూ వాడా ఎర్రజెండా రెపరెపలు.. ఘనంగా మేడే 

ఊరూ వాడా ఎర్రజెండా రెపరెపలు.. ఘనంగా మేడే 

నవతెలంగాణ-గోవిందరావుపేట 
మండల వ్యాప్తంగా ప్రతి గ్రామంలో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో గురువారం మేడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో పసర గ్రామంలో ఐదు వేరు వేరు ప్రాంతాల్లో కార్మిక సంఘాల నాయకులు ఎర్రజెండాను ఆవిష్కరించి ర్యాలీ నిర్వహించారు. వక్తలు మేడే విశిష్టతను వివరించారు. మండల కేంద్రంలో గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మేడే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది . ఈ కార్యక్రమానికి సీపీఐ(ఎం)మండల కార్యదర్శి సోమ మల్లారెడ్డి హాజరై మాట్లాడుతూ.. ఈరోజు ఎర్రజెండా ప్రపంచంలోని 192 దేశాల్లో రెపరెపలాడుతుందని అన్నారు .దోపిడి అసమానతలు ఉన్నంతకాలం ఎర్రజెండా ఉంటుందని ఆయన అన్నారు. కార్మికులు పోరాడి సాధించుకున్న ఎనిమిది గంటల పని దినాన్ని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తుంగలో తొక్కి 12 గంటల పనిదినాన్ని తీసుకురావడం కోసం ప్రయత్నిస్తుందని ఆయన అన్నారు. కార్మికుల హక్కులను కాలరాస్తున్న బీజేపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కార్మికులందరూ మేడే అమరవీరుల స్ఫూర్తితో ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు గుండు రామస్వామి, ఎండి గౌస్, గుండు లెనిన్,  కాప కోటేశ్వరరావు, గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ నాయకులు ఉప్పలయ్య, కుమారి,సుమన్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img