నవతెలంగాణ – గాంధారి
మండల కేంద్రంలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో మేడే సంబరాలు ఘనంగా జరిగాయి. కార్మికులు, కర్షకులు కలిసి సీపీఐ(ఎం), సిఐటియు జెండాను ఎగరవేయడం జరిగింది. ముఖ్యఅతిథిగా సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మోతి రామ్ నాయక్ పాల్గొని ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ.. అమెరికాలోని షికాగో నగరంలో హే మార్కెట్ ప్రాంతంలో ప్రపంచంలో జరిగిన సమ్మె సందర్భంగా అక్కడ కార్మిక యాజమాన్యులు జరిపిన బాంబు దాడిలో తుపాకుల కాల్పులకు అనేకమంది పోరాట యోధులు చనిపోయారని అన్నారు. రక్తంతో తడిసిన గుడ్డ ఎర్రజెండగా ఆవిర్భావించిందని అన్నారు. ఆ రోజు నుంచి కార్మికుల కర్షకుల వైపున నిలిచి ఈరోజు వరకు పోరాడుతూనే ఉందని అన్నారు. కార్మికులకు జీతాలు పెరగాలన్నా.. కొత్త ఉద్యోగాలు రావాలన్నా.. కర్షకులకు భూములు రావాలన్నా పాలకుల మేడలు వంచి హక్కులు సాధించుకోవడం కోసం పోరాడుతుందని అన్నారు. అటువంటి పార్టీ సంఘాలకు కార్మికులు కర్షకులు కలిసి పార్టీకి వెళ్ళు దన్నుగా నిలబడాలని కోరారు. 8 గంటల పని సాధించుకోవడం కోసం అనేకమంది కార్మికులు తమ ప్రాణాలకు ఫణంగా పెట్టారని, అందుకనే మేడెను పండగ రోజు లాగా హక్కులు సాధించుకున్న రోజు లాగా ప్రతి ఒక్కరూ గ్రామ గ్రామాన పల్లె వాడవాడనా ఎర్రజెండాను ఎగిరించాలని అన్నారు. వారం రోజులపాటు ఎర్రజెండా వారోత్సంగా జరపాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి సరాబ్ కిషన్ రావు గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి ప్రకాష్ నాయక్ శాఖ కార్యదర్శి ఉప్పల సాయిలు, వసంతరావు ,మధు, రామవ్వ డాక్కయ్య, సాయిలు ,భూపతి ,సాయవ్వ, కార్మికులు కర్షకులు పాల్గొన్నారు.
ఘనంగా మేడే సంబరాలు..
- Advertisement -
RELATED ARTICLES