- Advertisement -
నవతెలంగాణ – కట్టంగూర్
ఎరువులను అధికధరలకు విక్రయిస్తే దుకాణాలపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పి శ్రవణ్ కుమార్ హెచ్చరించారు. గురువారం మండల కేంద్రంలోని ఎరువుల దుకాణాలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుకాణదారులు ఎరువులను పిఓఎస్ మిషన్ ద్వారా మాత్రమే విక్రయించాలని, నిర్ణీత ఎమ్మార్పీ ధరలకే విక్రయించాలని సూచించారు. స్టాక్ వివరాలను ప్రతి షాపు ముందు బోర్డు ద్వారా ప్రదర్శించాలని చెప్పారు. షాపులలోని స్టాక్ ను తనిఖీ చేసి, ఆన్లైన్ రికార్డులను పరిశీలించారు. కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయన వెంట మండల వ్యవసాయ అధికారి గిరిప్రసాద్ ఉన్నారు
- Advertisement -