క్వార్టర్స్‌లో ఓడిన ఉన్నతి హుడా
చైనా ఓపెన్ సూపర్ సిరీస్
బీజింగ్ (చైనా) : చైనా ఓపెన్ సూపర్ సిరీస్‌లో భారత డబుల్స్ స్టార్స్ సాత్విక్‌సాయిరాజ్ రాంకిరెడ్డి, చిరాగ్ శెట్టి జోడీ సెమీఫైనల్లోకి ప్రవేశించింది. శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్‌ఫైనల్లో మలేషియా షట్లర్లు సిన్, టియోలపై సాత్విక్, చిరాగ్‌లు వరుస గేముల్లో గెలుపొందారు. 40 నిమిషాల్లోనే ముగిసిన క్వార్టర్స్ పోరులో 21-18, 21-14తో సాత్విక్, చిరాగ్‌లు విజయం సాధించారు. ఉత్కంఠగా సాగిన తొలి గేమ్‌లో 11-8తో ముందంజ వేసిన సాత్విక్, చిరాగ్ అదే జోరు కొనసాగించారు. మలేషియా షట్లరు పోరాడినా.. 21-18తో తొలి గేమ్‌ను గెల్చుకున్నారు. రెండో గేమ్‌లో భారత షట్లర్లు దూకుడు చూపించారు. 11-10తో విరామ సమయానికి ఆధిక్యంలో నిలిచిన సాత్విక్, చిరాగ్‌లు 15-14 తర్వాత వరుసగా ఆరు పాయింట్లతో రెండో గేమ్‌తో పాటు మ్యాచ్‌ను ముగించారు. మహిళల సింగిల్స్ క్వార్టర్‌ఫైనల్లో యువ షట్లర్ ఉన్నతి హుడా 16-21, 12-21తో మూడో సీడ్ జపాన్ అమ్మాయి అకానె యయగూచి చేతిలో పరాజయం పాలైంది. 33 నిమిషాల్లోనే లాంఛనం ముగించిన యమగూచి.. టీమ్ ఇండియా వర్థమాన స్టార్‌పై మెరుపు విజయం సాధించింది. ప్రీ క్వార్టర్స్‌లో సింధుపై విజయంతో ఆత్మవిశ్వాసంతో క్వార్టర్స్ బరిలోకి నిలిచిన ఉన్నతి హుడా ఆశించిన ప్రదర్శన చేయలేదు.
సెమీస్‌లో సాత్విక్ జోడీ
- Advertisement -
- Advertisement -