Sunday, July 27, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలువరంగల్‌ ఎయిర్‌పోర్టు భూసేకరణకు రూ.205 కోట్లు విడుదల

వరంగల్‌ ఎయిర్‌పోర్టు భూసేకరణకు రూ.205 కోట్లు విడుదల

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
వరంగల్‌లోని మామునూరు ఎయిర్‌పోర్టు నిర్మాణ పనుల్లో మరో కీలక ముందడుగు పడింది. ఎయిర్‌పోర్టు భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. రూ.205 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. మామునూరు వద్ద కొత్త బ్రౌన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్‌నాయుడు మార్చి నెలలో పచ్చజెండా ఊపిన సంగతి తెలిసిందే. ఈ విమానాశ్రయానికి అన్ని అనుమతులిస్తూ ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ (ఏఏఐ) నిర్మాణం ప్రారంభించడానికి వీలుగా సంబంధిత దస్త్రంపై సంతకం చేశారు. మరో 253 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం సేకరించి ఇస్తే కొత్త విమానాశ్రయ నిర్మాణం మొదలుపెడతామని కేంద్రమంత్రి ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే భూసేకరణ కోసం ప్రభుత్వం తాజాగా నిధులు విడుదల చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -