మంత్రి సీతక్క
నవతెలంగాణ – గోవిందరావుపేట
వికలాంగులు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని మంత్రి సీతక్క అన్నారు. గురువారం మండల కేంద్రంలో సిడిపిఓ శిరీష ఆధ్వర్యంలో వికలాంగులకు బ్యాటరీ ట్రైసైకిళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. వైకల్యం శరీరానికి మాత్రమే కానీ మనసుకు కాదు అన్నారు. శారీరక వికలాంగులు అయిన బాలాజీనగర్ గ్రామానికి చెందిన భూక్యా శిల్ప మరియు ఎల్బి నగర్ గ్రామానికి చెందిన కబ్బక లక్ష్మయ్య లకు బ్యాటరీ ట్రై సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైడాకుల అశోక్, ములుగు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, మండల అధ్యక్షులు పాలడుగు వెంకటకృష్ణ, జిల్లా కార్మిక శాఖ అధ్యక్షులు కొంపెల్లి శ్రీనివాస్ రెడ్డి మండల రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ నాయకులు, ప్రజా ప్రతినిధులు, యూత్ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు అందరూ పాల్గొన్నారు.
వికలాంగులు ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్లాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES