- Advertisement -
ధర రూ.74.90 లక్షలు
న్యూఢిల్లీ : జేఎస్‌డబ్ల్యు ఎంజీ మోటార్ ఇండియా తన సరికొత్త సైబర్‌స్టర్ ఇవి ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారును ఆవిష్కరించింది. దీని ఎక్స్‌షోరూం ధరను రూ.74.99 లక్షలుగా నిర్ణయించింది. ఇది 3.2 సెకన్లలోనే 1-100 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని పుంజుకోనుంది. 77 కిలోవాట్ బ్యాటరీ కలిగి ఉన్న ఈ కారును ఒక్కసారి చార్జింగ్ చేస్తే 580 కిలోమీటర్లు ప్రయాణించవచ్చని ఆ కంపెనీ తెలిపింది. నాలుగు రంగుల్లో అందుబాటులోకి తెచ్చిన ఈ ఎస్‌యూవీ ఎంజీ సెలెక్ట్ షోరూమ్‌లలో లభిస్తుందని పేర్కొంది.
- Advertisement -