Sunday, July 27, 2025
E-PAPER
Homeజాతీయంసామాజిక న్యాయానికి కాంగ్రెస్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌

సామాజిక న్యాయానికి కాంగ్రెస్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌

- Advertisement -

మంత్రి పొన్నం ప్రభాకర్‌
బీజేపీ రాజకీయం అండర్‌ గ్రౌండ్‌ అరేంజ్‌మెంట్‌
బీఆర్‌ఎస్‌ తో కుమ్మక్కై తెలంగాణలో బీజేపీ గెలుపు
బీజేపిది ద్వంద వైఖరి: మంత్రి కొండా సురేఖ
బీసీ రిజర్వేషన్లు అడ్డుకుంటే సకల జనుల ఉద్యమాన్ని చూస్తారు: మంత్రి వాకిటి
ఓర్వలేక బీఆర్‌ఎస్‌, బీజేపీల విష ప్రచారం: ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

విద్యా, ఉద్యోగం, లోకల్‌ బాడీ ఎన్నికల్లో బీసీలకు 42 రిజర్వేషన్లకు కల్పించే మంచి ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన బీసీ రిజర్వేషన్ల బిల్లులు ఆమోదం పొందేలా రాష్ట్ర బీజేపి నేతలు కేంద్రంపై ఒత్తిడి తేవాలని రాష్ట్ర మంత్రులు డిమాండ్‌ చేశారు. లేదంటే… తెలంగాణ బలహీన వర్గాల ఆగ్రహాన్ని చవిచూస్తారని హెచ్చరించారు. ఎట్టి పరిస్థితుల్లో రాబోయే లోకల్‌ బాడీ ఎన్నికల్లో 100 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తామన్నారు. శుక్రవారం ఢిల్లీలోని థల్‌ కటోరా స్టేడియంలో కాంగ్రెస్‌ పార్టీ బీసీ వింగ్‌ నేతృత్వంలో జరిగిన ‘భాగిదార్‌ న్యారు సమ్మెళన్‌’ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్‌, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి, విప్‌ ఆది శ్రీనివాస్‌, ఎమ్మెల్యే మక్కాన్‌ సింగ్‌ రాజ్‌ ఠాకూర్‌, లతో పాటు వందలాది మంది పాల్గొన్నారు. ఈ సమావేశం అనంతరం తెలంగాణ భవన్‌ లోని గురజాడ హాల్‌ లో మంత్రులు మీడియాతో మాట్లాడారు. వచ్చేవి వెనకబడిన తరగతుల రోజులే అని… అది సాధించుకోవడం కోసం అందరం కలిసి ఐక్యంగా ఉండాలన్సిన అవసరం ఉందని మంత్రి పొన్నం అన్నారు. సామాజిక న్యాయానికి కాంగ్రెస్‌ పార్టీ బ్రాండ్‌ అంబాసిడర్‌ అని మంత్రి పొన్న ప్రభాకర్‌ అన్నారు. ఆనాడు తెలంగాణ రాష్ట్రం కోసం, బడుగు బలహీన వర్గాల కోసం… సొంత పార్టీలోనూ పోరాడామని గుర్తు చేశారు. చేతనైతే బీజేపీ రాష్ట్ర నేతలు కూడా… తెలంగాణ ప్రజల కోసం అధిష్టానంపై ఒత్తిడి తేవాలని హితవు పలికారు. లేదంటే సొంత పార్టీలోనే బీజేపీ నేతలు అణచివేతకు గురవుతారన్నారు. ఈ విషయంలో బీఆర్‌ఎస్‌, బీజేపీ, ఇతర పార్టీలోని బీసీ నేతలు కూడా ఆలోచించాలని, సొంత వర్గానికి జరగబోయే మేలు కోసం కలిసి రావాలని పిలుపునిచ్చారు. దశాబ్దాల తర్వాత బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు వస్తున్నాయనే ఎదురు చూసే ధోరణిలో ఉన్నామన్నారు. బీజేపి నేతలు బీసీల నోటి కాడికి వచ్చిన కూడును తన్నే ప్రయత్నం చేయోద్దన్నారు. అలా కాదని బీసీ రిజర్వేషన్లను అడ్డుకోవాలని చూస్తే… తెలంగాణలోని కుల సంఘాలు బీజేపీ నేతల్ని ఒక్క అడుగు కూడా బయటపెట్టనీయవని హెచ్చరించారు. స్థానిక సంస్థల్లో ప్రారంభమైన ఈ రిజర్వేషన్లు… రేపు చట్ట సభల్లో రిజర్వేషన్ల వరకు పోతుందన్నారు. స్లబ్‌ ప్లాన్‌ లు వస్తుందని.. తద్వారా ఆర్థికంగా, రాజకీయంగా, విద్యారంగంలో బీసీలు అభివద్ధి చెందుతారని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన బీసీ రిజర్వేషన్లతో దేశ వ్యాప్తంగా బీసీ బిడ్డలకు స్వాంతంత్య్రం రాబోతుందన్నారు.
బీజేపిది అండర్‌ గ్రౌండ్‌ అరెంజ్‌మెంట్‌…
‘మేం ఓడిపోయిన ప్రస్టేషన్‌ లో ఉన్నాం… బీజేపీ గెలుస్తుందనే ఆలోచన కూడా లేదు కదా?. బీఆర్‌ఎస్‌ తో కుమ్మక్కై గెలుస్తున్నారనే తప్ప… స్వంతగా గెలిచే శక్తి ఎక్కడిది. బీజేపీ రాజకీయం అండర్‌ గ్రౌండ్‌ అరేంజ్‌మెంట్‌ మాత్రమే.’ అని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డికి మంత్రి పొన్నం ప్రభాకర్‌ కౌంటర్‌ ఇచ్చారు. రేపు దేశ వ్యాప్తంగా కేంద్రం కులగణన చేయబోతోందని, ఫైనల్‌ కేంద్రం సూచించే అంశాలనే అడాప్ట్‌ చేసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. అందువల్ల కాంగ్రెస్‌ కంటే ఎక్కువ బీసీలకు ఏం చేస్తారో చెప్పి… వారి మనసులు గెలవాలన్నారు. అంతేకానీ… బీసీలకు రాజ్యాధికారంకోసం జరుగుతోన్న ప్రక్రియను అడ్డుకోవద్దని బీజేపీ నేతల్ని కోరారు.
మాటకు ముందు ముస్లిం రిజర్వేషన్ల వ్యతిరేకం అంటోన్న బీజేపీ నేతలు… గుజరాత్‌, యూపీ, మహారాష్ర, పొత్తులో ఉన్న పక్క రాష్ట్రం ఏపీలో ముస్లిం రిజర్వేషన్లు తొలగించి మాట్లాడాలని సవాల్‌ విసిరారు. తెలంగాణలో ఇప్పటికే ఏ,బీ,సీ,డీ,ఈ ప్రపోజన్‌ రిజర్వేషన్లు ఉన్నాయని, వీటి విషయంలో ప్రజల్‌లో అపోహలు సష్టించి రాజకీయ లబ్ది పొందాలని బీజేపీ చూస్తోందన్నారు. ముందు నుంచి బీసీ వ్యతిరేకిగా బీజేపీ వ్యవహరిస్తోందని మంత్రి ఫైర్‌ అయ్యారు. బీసీలకు సంబంధించి ఆనాడు మండల్‌ కమిషన్‌ కు వ్యతిరేకంగా… దేశ వ్యాప్తంగా కమండల్‌ యాత్ర చేపట్టిన చరిత్ర ఆ పార్టీదని దుయ్య బట్టారు. నేడు ముస్లింల పేరు చెప్పి… బీసీలకు అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. తెలంగాణ నుంచి కేంద్రంలో మంత్రిగా ఉన్న కిషన్‌ రెడ్డి బాధ్యత తీసుకొని బీసీ రిజర్వేషన్ల అంశంపై ప్రధాని అపాట్మెంట్‌ తీసుకోవాలని సూచించారు. ఇచ్చిన మాటకు కట్టుబడి బీసీ రిజర్వేషన్ల బిల్లు అసెంబ్లీలో ఆమోదం చేసి, కేంద్రానికి పంపామన్నారు. కానీ… బీజేపీ ఫ్యూడలిస్టిక్‌ బుద్ధితో ఈ బిల్లుల్ని ఆపుతోందని మండిపడ్డారు. వ్యవస్థాత్మకంగా తమ నరాల్లో ఉన్న ఈ ఐడియాలజీని బీజేపీ నేతలు బీసీ బిడ్డలపై రుద్దొద్దని విమర్శించారు. ప్రస్తుతం రాష్ట్రంలో బీసీ, ఎస్సీ,ఎస్టీ కలిపి 54 శాతంగా ఉన్నాయని, దీనికి10 శాతం ఈడబ్ల్యూసీ రిజర్వేషన్లు జోడిస్తే… ఏనాడో 50శాతం రిజర్వేషన్ల పరిమితి దాటినట్లైందన్నారు.
కిషన్‌ రెడ్డి ద్వంద వైఖరి..
కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి ద్వంద వైఖరితో వ్యవహరిస్తున్నారని మంత్రి కొండా సురేఖా ఫైర్‌ అయ్యారు. ఒక వైపు ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తామంటునే… మతం పేరిట తెలంగాణ లో బీసీ రిజర్వేషన్లు అడ్డుకుంటున్నారని మంత్రి అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లులను ఆమోదిస్తారా? లేక రిజక్ట్‌ చేస్తారా? అనేది ఏదో ఒకటి చెప్పాలని డిమాండ్‌ చేశారు. అంతేకానీ… ఆ బిల్లులను తెల్చకుండా, మతం పేరిట రాజకీయాలు సరికాదని హితవు పలికారు. రాష్ట్ర నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులుగా ఉన్నా… రాష్ట్రానికి తెచ్చింది ఏమీ లేదన్నారు. బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటే… తెలంగాణలో జరిగిన సకల జనుల సమ్మెను మించిన ఉద్యమాన్ని చూస్తారని మరో మంత్రి వాకిటి శ్రీహరి కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఎంత సేపు రాహుల్‌ గాంధీ, రేవంత్‌ రెడ్డి లపై విమర్శలు చేయడం కాదని… చిత్తశుద్ధి ఉంటే బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలన్నారు.
ప్రస్టేషన్‌ తట్టుకోలేకే బీఆర్‌ఎస్‌, బీజేపీ విమర్శలు...
బీసీ రిజర్వేషన్ల బిల్లును 9 వ షెడ్యూల్‌ లో చేర్చాలని పంపిస్తే… ఆ ఫైల్‌ ను పక్కన పెట్టి, కాంగ్రెస్‌ చిత్తశుద్ధిని బీజేపీ నేతలు శంకించడం విడ్డూరంగా ఉందని విప్‌ ఆది శ్రీనివాస్‌ విమర్శించారు. బీసీల్లో రోజు రోజుకు కాంగ్రెస్‌ పైపెరుగుతోన్న అభిమానాన్ని ఓర్వలేక ఆ రెండు పార్టీలు విష ప్రచారం చేస్తున్నాయని ఫైర్‌ అయ్యారు. నిన్నటి వరకు సీఎం రేవంత్‌ రెడ్డికి పార్టీ అగ్రనేతల రాహుల్‌ గాంధీ అపాయిట్మెంట్‌ ఇవ్వలేదని ప్రచారం చేసిన కేటీఆర్‌ టీం… తాజాగా రాహుల్‌ సీఎంపై ప్రశంసలు కురిపించగానే తట్టుకోలేకపోతుందన్నారు. అసలు కుల గణనలో భాగం కాని కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌ రావులకు బీసీ రిజర్వేషన్లపై మాట్లాడే హక్కే లేదన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -