Sunday, July 27, 2025
E-PAPER
Homeరాష్ట్రీయండిస్కం స్టోర్‌ హమాలీలను ఆర్టిజన్స్‌గా గుర్తించాలి

డిస్కం స్టోర్‌ హమాలీలను ఆర్టిజన్స్‌గా గుర్తించాలి

- Advertisement -

– ఎస్‌పీడీసీఎల్‌కు సీఐటీయూ వినతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పవర్‌ డిస్కాంలలో 30 ఏండ్లలో లోడింగ్‌-అన్‌లోడింగ్‌ కార్మికులుగా పనిచేస్తున్న ఎలక్ట్రిసిటీ స్టోర్‌ వర్కర్స్‌ను డిస్కాం స్టోర్స్‌లో గుర్తింపు కార్డులు పొందిన వారిని ఆర్టిజన్స్‌ కింద రెగ్యులర్‌ చేయాలని తెలంగాణ రాష్ట్ర ఎలక్ట్రిసిటీ స్టోర్‌ వర్కర్స్‌ యూనియన్‌ (సీఐటీయూ) డిమాండ్‌ చేసింది. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్‌లోని మింట్‌ కాంపౌండ్‌లో ఎలక్ట్రిసిటీ కార్యాలయం టీఎస్‌ ఎస్‌పీడీసీఎల్‌ చైర్మెన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ ముజుఫర్‌ ఫరూఖీని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, ఆ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు కత్తుల యాదయ్య, ప్రధాన కార్యదర్శి వంగూరు రాములు, సీఐటీయూ సూర్యాపేట జిల్లా కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్వర్లు, కిరణ్‌, గిరి, శ్రీనివాస్‌ (మహబూబ్‌నగర్‌), రవి తదితరులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జూలకంటి రంగారెడ్డి పలు అంశాలను చైర్మెన్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఎలక్ట్రిసిటీ స్టోర్‌లో పనిచేస్తున్న లోడిండ్‌-అన్‌లోడింగ్‌ కార్మికుల వివరాలు 2013లో తీసుకొని ఇప్పటివరకు రెగ్యులర్‌ చేయకపోవడాన్ని ఎత్తిచూపారు. 30 ఏండ్ల నుంచి పనిచేస్తున్నా వారిని ఎందుకు గుర్తించడం లేదని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్టిజన్స్‌గా గుర్తించి రెగ్యులర్‌ చేస్తారనే ఆశతోనే ఈ ప్రమాదకరమైన పనిని చేస్తున్నారనీ, వారిలో ఎక్కువగా నిరుపేద దళిత, బడుగు, బలహీనవర్గాలకు చెందినవారే ఉన్నారని తెలిపారు. ఎలక్ట్రిసిటీ స్టోర్‌లలో పనిచేసే లోడిండ్‌-అన్‌లోడింగ్‌ కార్మికులకు కాంట్రాక్ట్‌ విధానం రద్దు చేసి ప్రభుత్వం ఆర్టిజన్స్‌గా గుర్తించి రెగ్యులర్‌ చేయాలని కోరారు. ప్రభుత్వంతో చర్చించి న్యాయం చేసేలా చూస్తామని చైర్మెన్‌, డైరెక్టర్‌ ముజుఫర్‌ ఫరూఖీ హామీనిచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -