Sunday, July 27, 2025
E-PAPER
HomeజాతీయంTGSRTC: బెంగళూరు, విజయవాడ ప్రయాణికులకు టీజీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్

TGSRTC: బెంగళూరు, విజయవాడ ప్రయాణికులకు టీజీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: హైద‌రాబాద్ నుంచి బెంగ‌ళూరు, విజ‌య‌వాడ మార్గాలలో న‌డుస్తున్న టీజీఎస్ఆర్‌టీసీ బ‌స్సుల టికెట్ ధ‌ర‌ల‌ను సంస్థ భారీగా త‌గ్గించింది. ఛార్జీల‌పై 16 నుంచి 30 శాతం వ‌ర‌కు రాయితీలు ప్ర‌క‌టిస్తూ నిర్ణ‌యం తీసుకుంది. విజ‌య‌వాడ‌కు గ‌రుడ ప్ల‌స్ బ‌స్సు టికెట్ ధ‌ర రూ. 635 నుంచి రూ. 444కు, గ‌రుడ క్లాస్ ధ‌ర రూ. 592 నుంచి రూ. 438కు, రాజ‌ధాని రూ. 533 నుంచి రూ. 448, ల‌గ్జ‌రీ సూప‌ర్ క్లాస్ ధ‌ర రూ. 815 నుంచి రూ. 685కు త‌గ్గించింది.

అలాగే బెంగ‌ళూరు మార్గంలో సూప‌ర్‌ల‌గ్జ‌రీ బ‌స్సు టికెట్ ధ‌ర రూ. 946 నుంచి రూ. 757కు, ల‌హ‌రి ఏసీ స్లీప‌ర్ బ‌స్సులో బెర్త్ రూ. 1569 నుంచి రూ. 1177కు, ల‌హ‌రి ఏసీ స్లీప‌ర్ బెర్త్ క‌మ్ సీట‌ర్ ధ‌ర రూ. 1203 నుంచి రూ. 903కు, బెర్త్ రూ. 1569 నుంచి రూ. 1177కు త‌గ్గించింది. ఈ రాయితీలు ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్ బుకింగ్‌ల‌కు వ‌ర్తిస్తాయ‌ని ఆర్‌టీసీ ప్ర‌క‌టించింది. దీంతో టీజీఎస్ఆర్‌టీసీ తీసుకున్న ఈ నిర్ణ‌యం ప‌ట్ల ప్ర‌యాణికులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -