- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: రుతుపవనాలు, ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ వ్యాప్తంగా ముసురు కమ్ముకోవడంతో చల్లని వాతావరణం ఏర్పడి.. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సిటీ ప్రజలు రోడ్లపై, పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో వాతావరణ శాఖ తెలంగాణకు అలర్ట్ జారీ చేసింది. రాగల 24 గంటల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలతో పాటు.. రాష్ట్ర వ్యాప్తంగా 40-45 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని అంచనా వేసింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. గాలులు వీచే సమయంలో చెట్ల కింద ఉండకూడదని సూచించింది.
- Advertisement -