Sunday, July 27, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బురద రోడ్డులో ప్రయాణికుల ఇబ్బంది 

బురద రోడ్డులో ప్రయాణికుల ఇబ్బంది 

- Advertisement -

నవతెలంగాణ – రామారెడ్డి 
రామారెడ్డి పరిసర ప్రాంతంలో గల గంగమ్మ వాగుపై బ్రిడ్జి పునర్నిర్మాణంలో భాగంగా పనులు దాదాపు రెండు సంవత్సరాల నుండి నిర్వహిస్తున్నారు. అది ఇంకా జాప్యం చేయడంతో, గత సంవత్సరం వర్షాకాలంలో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా, బ్రిడ్జి పునర్నిర్మానం పూర్తి కాకపోవడంతో.. గత మూడు నాలుగు రోజుల నుండి కురుస్తున్న వర్షానికి బ్రిడ్జి ప్రక్కన గల తాత్కాలిక రోడ్లో ప్రయాణికులు ప్రమాదపు అంచున ప్రయాణిస్తున్నారు. రోడ్ అంతా బురదమయం కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. గత 15 రోజుల నుండి పునర్నిర్మానాన్ని చేపట్టినా..పనులు పూర్తికాక పోవడం ప్రజలకు ఇబ్బందిగా మారింది. తాత్కాలిక రోడ్డును ఇబ్బంది లేకుండా చూడాలని, బ్రిడ్జి నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు రవాణా సౌకర్యం కోసం ఏర్పాటు చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -