- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజు.. గోవా గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆయన్ని గోవా గవర్నర్‌గా ఎంపిక చేసింది. 1982లో టీడీపీలో చేరిన ఆయన.. వరుసగా 6సార్లు టీడీపీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మంత్రిగా చాలా శాఖలను నిర్వహించారు. 2014లో మోదీ ప్రభుత్వంలో ఆయన విమానయాన శాఖ మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు గోవా గవర్నర్‌గా సేవలు అందించనున్నారు.
- Advertisement -