నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి మండల బీఆర్ఎస్ మండల పార్టీ మాజీ అధ్యక్షుడు పిప్పిరి ఆంజనేయులు శుక్రవారం రాత్రి మృతి చెందగా, శనివారం ఉదయం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో ఆయన పార్థివ దేహాన్నికి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్, కామారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షుడు యంకె ముజీబోద్దీన్ నివాళులు అర్పించారు. అనారోగ్యంతో శుక్రవారం ఆయన మృతి చెందిన విషయం తెలిసిందే. శనివారం ఆయన ఇంటికి వెల్లి పార్థివ దేహంపై పూలమాలవేసి అంజలి ఘటించారు. గంప గోవర్ధన్ ఆంజనేయులు తో ఉన్న సన్నిహిత్యాన్ని గుర్తు చేసుకొని కన్నీటి పర్యంతమయ్యారు. పిప్పిరి ఆంజనేయులు టిడిపి హయాం నుండి గంప గోవర్ధన్ తోనే ఎక్కువగా సన్నిహితంగా ఉంటూ ముఖ్య అనుచరుడుగా కొనసాగారు. అనంతరం కామారెడ్డి హౌసింగ్ బోర్డ్ లోని స్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఎం.కె ముజీబుద్దిన్, బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జూకంటి ప్రభాకర్ రెడ్డి, నాయకులు గేరిగంటి లక్ష్మీనారాయణ, బాలరాజు, జూకంటి మోహన్ రెడ్డి, టేక్ రియల్ బలవంతరావు, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ పిప్పిరి సుష్మ, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పిప్పిరి వెంకట్, పాత హనుమాన్లు, మండల బిఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డి తాజా మాజీ ఎంపీపీ పార్థివ దేహానికి నివాళులర్పించిన బీఆర్ఎస్ నాయకులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES