Sunday, July 27, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలి…

స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలి…

- Advertisement -
  • – ప్రభుత్వ మోసాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి
    నవతెలంగాణ-పెద్దవూర

    స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని,ప్రభుత్వ మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నాగార్జునసాగర్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్, మాజీ శాసనసభ్యులు నోముల భగత్ కుమార్ అన్నారు. శనివారం మండల కేంద్రం లో ముఖ్య కార్యకర్తల సమావేశం లో మాట్లాడారు. గతంలో కెసిఆర్ గారి పాలనలో అమలైన పథకాలు,గ్రామాలలో అభివృద్ధి ప్రతి ఒక్కరు గుర్తించుకోవాలిని తెలిపారు.గ్రామాల్లో కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ విజయం సాధించేలా కృషి చేయాలన్నారు.కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలను అమలు చేయడంలో విఫలమైందని,గ్రామాల్లో చర్చ పెట్టి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని సూచించారు.వార్డు మెంబర్ నుండి ఎంపీపీ, జెడ్పీటీసీల వరకు బీఆర్ఎస్ పార్టీయే విజయం సాధిస్తుందన్నారు.
  • స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కార్యకర్త కష్టపడి పని చేయాలని, పార్టీ గెలుపు కోసం కష్టపడి పని చేసిన కార్యకర్తలకు గుర్తింపు ఉంటుందని తెలిపారు. రెండు సంవత్సరాలు ఓపిక పడితే కెసిఆర్ గారి ప్రభుత్వం వస్తుందని కార్యకర్తలు అందరూ ధైర్యంగా ఉండాలని అని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు జటావత్ రవి నాయక్, మాజీ సర్పంచ్ మెండే విష్ణు ప్రియ సైదులు,మాజఎంపీపీ చెన్ను అనురాధ సుందర్ రెడ్డి, మండల యూత్ పొదిల శ్రీనువాస్,ఎస్టీ సెల్ అధ్యక్షుడు రమావత్ రవి నాయక్, శ్రీకర్ నాయక్, రావుల శ్రీను, లక్ష్మణ్, రాజేష్ నాయక్, దశ్రు నాయక్, రాజేష్ నాయక్, గురువారెడ్డి, చీనా నాయక్, బాలవర్ధి రాజు, నల్లమెట్టి భాస్కర్, శ్రీనివాస చారి, శశిధర్ రెడ్డి, చేన్ను వెంకట్ రెడ్డి, వెంకటేశ్వరరావు, వెంకటయ్య, గోపి, హరి నాయక్, ఎల్లయ్య గౌడ్ తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. 
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -