Sunday, July 27, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రజా ఆరోగ్యాన్ని కాపాడుతున్న పారిశుద్ధ కార్మికులు

ప్రజా ఆరోగ్యాన్ని కాపాడుతున్న పారిశుద్ధ కార్మికులు

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి
ప్రతినిత్యం ప్రజల కొరకు ప్రజల ఆరోగ్యం గురించి తమ ఆరోగ్యాన్ని పణంగా పెట్టి పని చేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల సేవలు అభోగమని జిల్లా అదనపు కలెక్టర్ ఏ. భాస్కరరావు తెలిపారు. శనివారం ఉదయం మున్సిపల్ కమిషనర్ జి రామలింగం సమక్షంలో ఆర్కే హాస్పిటల్ కామినేని హాస్పిటల్ ఆధ్వర్యంలో చావా ఫౌండేషన్ తరపున పారిశుద్ధ్య కార్మికులకు ఉచిత వైద్య మెగా శిబిరం నిర్వహించారు.  భువనగిరి పట్టణాన్ని ప్రతిరోజు పరిశుభ్రంగా ఉంచి, అనేక కార్యక్రమాలలో పారిశుద్ధ్య కార్మికులు పాల్గొంటారని తెలిపారు. పరిసరాల పరిశుభ్రత కార్యక్రమంలో ప్రజలను భాగస్వామ్యలుగా చేయాలని కోరారు.

మనము ఆరోగ్యంగా ఉండాలంటే జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. మున్సిపల్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు హెల్త్ క్యాంపులు నిర్వహిస్తూ వారికి కావలసిన మందులను ఇవ్వడం సంతోషకరమన్నారు. కార్మికుల కు ఈ సి జి, తుడికో, బిఎండి  షుగర్, బ్లడ్ ప్రెషర్, టెస్టులతో పాటు ఆర్థోపెడిషన్ గైనకాలజిస్ట్ కార్డియాలజిస్ట్ జనరల్ ఫిజీషియన్ డాక్టర్లు ప్రత్యేక పరీక్షలు నిర్వహించారు. కార్మికులు తమ ఆరోగ్యాల పై శ్రద్ధ వహించి వారి ఆరోగ్యాలు కాపాడుకుంటూ పారిశుద్ధ్య పనులను నిర్వహించాలన్నారు వీరికి ప్రజలందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, వైద్యులు, వైద్య సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -