Sunday, July 27, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పారిశుద్ధ్య చర్యలు ఎప్పటికప్పుడు చేపట్టాలి...

పారిశుద్ధ్య చర్యలు ఎప్పటికప్పుడు చేపట్టాలి…

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
వానాకాలంలో సిజనల్ వ్యాధులు ప్రబలకుండా  పారిశుద్ధ్య చర్యలు ఎప్పటికప్పుడు చేపట్టాలని భూపాలపల్లి జిల్లా పంచాయతీ అధికారి వీభద్రయ్య పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు.శనివారం మండల కేంద్రమైన తాడిచర్లలో పారిశుద్ధ్య సిబ్బంది చేస్తున్న పనులను పరిశీలించారు. వానాకాలంలో నిత్యం పారిశుద్ధ్య పనులు, వాటర్ ట్యాoక్ లు శుభ్రం చేస్తూ, తాగునీరు పైప్ లైన్ లికేజీలు కాకుండా వాటర్ కాంటమినేషన్ జరగకుండా చూడాలన్నారు. ఖాళీ ప్రదేశాల్లో, రోడ్లపై మురికి నీరు నిల్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మల్లికార్జున్ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -