- Advertisement -
నవతెలంగాణ -పాపన్నపేట
వీడని వానలతో మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పాపన్న పేట ఎస్సై శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. మంజీరా నదికి వరదలు వస్తున్నందున పశువుల, కాపరులు, రైతులు, కూలీలు, ఇతరు లెవరు అటు వైపు వెళ్ళొద్దన్నారు . మత్స్యకారులు చేపల వేటకు వెళ్ల వద్దని చెప్పారు.వర్షం పడే సమయం లో విద్యుత్ స్తంభాల క్రింద నిలబడో ద్దని, కరెంట్ వైర్లు ముట్టు కోవద్దని సూచించారు. వ్యవసాయ దారులు ముందు జాగ్రత్తలు తీసుకోకుండా, స్టార్టర్ డబ్బులు, కేబుల్, సర్వీస్ వైర్లు ముట్టు కోవద్దని చెప్పారు.శిథిల మైన ఇళ్లలో ఉండొద్దన్నారు. ఎక్కడ ప్రమాదం జరిగినా వెంటనే 100 నెంబర్ కు గానీ, పోలీస్ స్టేషన్ గాని సమాచారం ఇవ్వాలని సూచించారు.
- Advertisement -