నవతెలంగాణ – జుక్కల్
ఋతుపరమైన, నీటి ద్వారా వ్యాపించే వ్యాధులను నివారించేందుకు గ్రామస్థాయి బృందాలను ఆర్ డబ్ల్యు ఎస్ అధికారులు అప్రమత్తం చేసారు. శనివారం నాడు మండలంలోని డోన్ గావ్, శక్తి నగర్, మధుర తండా, శక్తి నగర్ తండా, గుండూరు తండా, గుండూర్ గ్రామాలలో మిషన్ భగీరథ కామారెడ్డి జిల్లా ఇన్ ట్రా ఈఈ రమేష్ , జుక్కల్ ఇన్ ట్రా ఏ ఈఈ సయ్యద్ నయూమ్, మండలంలోని పలు గ్రామాలను క్షేత్రస్థాయిలోకి వెళ్లి సందర్శించారు . ఈ సందర్భంగా మిషన్ భగీరథ నుండి సరఫరా జరిగే నీటీ సప్లై లేకపోయినప్పుడు ఓపెన్ వెల్ ద్వారా వాటర్ ను ఉపయోగిస్తున్నారు. అదేవిధంగా గ్రామస్థాయిలోని పలు గ్రామాల వాటర్ మెన్ లకు ఓ హెచ్ ఎస్ ఆర్ లను శుభ్రంగా ఉంచాలి. ప్రతిరోజు బ్లీచింగ్ పౌడర్ వేయాలి. వర్షాకాలంలో త్రాగునీటిని మరిగించి చల్లార్చిన తర్వాతనే గ్రామాలలోని ప్రజలు త్రాగాలీ . ఋతుపరమైన మరియు నీటి ద్వారా వ్యాపించే సీజనల్ వ్యాధులను అరికట్టాలని అన్నారు . గ్రామ స్థాయి బృందాలను అప్రమత్తం చేసామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ ఇన్ ట్రా అధికారులు , ఆయా గ్రామాల గ్రామపంచాయతీ కార్యదర్శులు అంజయ్య , నాగనాథ్ , స్రావంతి తదితరులు పాల్గొన్నారు .
నీటీ ద్వారా వ్యాపించి వ్యాధులను నివారించేందుకు అప్రమత్తం చేసిన ఆర్ డబ్ల్యు ఎస్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES