నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ మండలంలో పలు గ్రామాలు శనివారం నాడు భారీ వర్షాలకు గ్రామాలలో కురుస్తుండడంతో రైతులు ఉల్లాసంగా ఉత్సాహంగా సంభ్రమోత్సవాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మండలంలోని పడంపల్లి , పెద్ద ఏడ్గి , నాగల్ గావ్ గ్రామాలలోని రైతులు, గ్రామస్తులు అందరు కలిసి గ్రామ దేవతలకు జిలాభిషేకం చేశారు. వర్షాన్ని కూడా లెక్కచేయకుండా మహిళా రైతులు ఇంటికో హారతి , ఇంటికి ఓ కలశం , తీసుకుని గ్రామదేవతలు నైవేద్యాలు పెట్టి జలాభిషేకం చేస్తూ భాజా భజంత్రీ , ఆటపాటలతో నృత్యాలు చేసి ఆనందింపజేస్తూ ఉల్లాసంగా గ్రామాలలో అన్న ప్రసాదాలు పంపిణీ చేశారు . ఈ వర్షంతో మండలంలో కోట్లాది రూపాయల పంటలకు లాభం చేకూరిందని రైతులు తెలిపారు. వర్షం కురియాలని మొక్కులు మొక్కుకున్న రైతులు నేటి వర్షంతో సంబ్రమోత్సవాలు నిర్వహించారు . ఒకరిపై ఒకరు నీళ్లు చల్లుకుంటూ వర్షాన్నో కూడా లెక్కచేయకుండా కలశంలో నీటిని నింపుకొని గ్రామ దేవతలకు పూజలు చేసి జలాభిషేకం నిర్వహించారు. గత 20 రోజులుగా వర్షం లేక దిగాలుగా ఉన్న రైతులు మూడు రోజులుగా కొనసాగుతున్న తుఫాన్ గ్రామాలలో నిత్యం వర్షాలు పడుతుండడంతో పంటలు ఎక్కువగా పెరుగుతాయని అన్నారు. మంచి దిగుబడి లాభాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. పడంపల్లి గ్రామంలో నిర్వహించిన గ్రామ దేవతల జలాభిషేకం కార్యక్రమంలో గ్రామస్తులు పావుడే సులోచన , పావుడే సరస్వతి , భాగ్యశ్రీ, పుణ్యమ్య, లక్షెట్టి సుశీల, మాధారావ్ , హెచ్ . మహేష్ , లక్షెట్టి లింగురాం, శ్రీకాంత్ , సంగు, స్వప్నిల్ , మారుతి గొండ , రఘు గొండా , భీమ్రావు, సుధాకర్ , లక్ష్మణ్ , సిద్దయ్యప్ప , పంచ అయ్యప్ప, హనుమంత్, ఎల్ . మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.
కరుణించిన వరుణుడు… ఉల్లాసంగా రైతులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES