నవతెలంగాణ గోవిందరావుపేట
రైతులు వారి పంటలలోకి క్రిమిసంహారక రసాయన మందుల వినియోగం తగ్గించాలని ఏవో మరియు వెలుగు రేఖ గ్రామీణ అభివృద్ధి సంస్థ ఎం ఏవో కె జితేందర్ రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని రంగపూర్, ముత్తాపూర్ గ్రామంలో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో వెలుగు రేఖ గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో గ్రామ సభను ఏర్పాటు చేయటం జరిగింది. ఈ సభలో వెలుగు రేఖ గ్రామీణాభివృద్ధి సంస్థ ఎంఏఓ కె. జితేందర్ రెడ్డి, వెలుగు రేఖ గ్రామీణ అభివృద్ధి సంస్థ NGO సీఈఓ రజిత, ఏఈఓ దాదా సింగ్, గోపాల్ రెడ్డి, ట్రైనర్ సాంబయ్య లు వివిధ గ్రామాల రైతులతో మాట్లాడారు. ప్రకృతి వ్యవసాయం వల్ల పెట్టుబడి ఖర్చులు తగ్గించి లాభాలు పొందవచ్చని, క్రిమి సంహారక మందుల వాడకం తగ్గించి ముందు తరాలవారికి ఆరోగ్యవంతమైన జీవితం అందించాలని కోరారు. అనంతరం 125 మంది రంగాపుర్ రైతులని , 125మంది ముతాపూర్ ,ఇద్దరు సి ఆర్ పీ క్లస్టర్ నుండి ఎంపిక చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు.
క్రిమి సంహారక రసాయన మందుల వాడకం తగ్గించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES