– మండల వ్యవసాయ అధికారిణి రమ్యశ్రీ
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలో రైతుల అవసరం మేరకు యూరియా అందుబాటులో ఉందని, ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మండల వ్యవసాయ అధికారిణి రమ్యశ్రీ అన్నారు. శనివారం మండలంలోని కోన సముందర్ సింగిల్ విండో పరిధిలోని గోదాంలో నిల్వ ఉన్న యూరియా బస్తాలను పరిశీలించారు. సింగిల్ విండో కార్యాలయానికి సరఫరా జరిగిన యూరియా, రైతులకు పంపిణీ చేసిన యూరియా స్టాక్ వివరాల రికార్డులను పరిశీలించారు. అనంతరం మండల వ్యవసాయ అధికారిని రమ్యశ్రీ మాట్లాడుతూ కమ్మర్ పల్లి, ఉప్లూర్, హాస కొత్తూర్, కోన సముందర్, కోనాపూర్ గోదాములలో సరిపడా యూరియా అందుబాటులో ఉన్నట్లు తెలిపారు.యూరియా అవసరం ఉన్న ప్రతి రైతు తప్పనిసరిగా ఆధార్ కార్డు, పట్టా పాస్ బుక్ తీసుకొని అందుబాటులోని సింగిల్ విండో గోదాముల వద్దకు వెళ్లి యూరియా తీసుకోవాలన్నారు. కోన సంబంధ సింగిల్ విండో పరిధిలోని గోదాములలో 20.635 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉన్నట్లు ఆమె తెలిపారు. రైతులు ఆందోళన చెందకుండా అందుబాటులో ఉన్న యూరియాని తీసుకువెళ్లాలని సూచించారు. యూరియా విషయంలో ఎలాంటి వదంతులు నమ్మొద్దని, రైతుల అవసరం మేరకు యూరియా అందుబాటులో ఉందని మరో మారు స్పష్టం చేశారు.
రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉంది
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES