Sunday, July 27, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఉమ్మడి మాచారెడ్డి మాజీ వైస్ ఎంపీపీ మృతి 

ఉమ్మడి మాచారెడ్డి మాజీ వైస్ ఎంపీపీ మృతి 

- Advertisement -

నవతెలంగాణ-రామారెడ్డి 
ఉమ్మడి మాచారెడ్డి మండలం మాజీ వైస్ ఎంపీపీ, ఇన్చార్జి ఎంపీపీగా పనిచేసిన మద్దికుంట గ్రామానికి చెందిన తోట బుగ్గరాములు అనారోగ్యంతో శనివారం మృతి చెందారు. ఉద్యమాలే  ఊపిరిగా, పేద ప్రజల కోసం మావోయిస్టు సానుభూతిపరునిగా, అదే స్ఫూర్తితో తెలంగాణ ఉద్యమంలో జిల్లాలోని చురుకైన నాయకునిగా పనిచేసి, అనేక కేసులు నమోదైన మడిమతింపక, ఉద్యమించారు. టీఆర్ఎస్ పార్టీ నుండి మద్దికుంట గ్రామ ఎంపీటీసీగా ఏకగ్రీవంగా ఎన్నికై, మాచారెడ్డి మండల వైస్ ఎంపీపీ గా ప్రజలకు సేవలు అందించారు. మండలంలో ప్రజల కోసం చేపట్టిన పనులు నాణ్యతతో చేయడంలో ఆయన దిట్టు, ఇప్పటికీ ఆయన చేసిన పనులను చూసి ప్రజలు కొనియాడుతుంటారు. తెలంగాణ ఉద్యమం కోసం, వైస్ ఎంపీపీగా పనులు చేపట్టి, తన సొంత ఆస్తులను విక్రయించిన ప్రజా నాయకుడిగా ఆయనకు పేరుంది. అలాంటి నాయకుడు మరణించడం తీరని లోటని పార్టీలకు అతీతంగా పలువురు కొనియాడారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -