Sunday, July 27, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విద్యార్థుల సమస్యలపై ఉద్యమించాలి..

విద్యార్థుల సమస్యలపై ఉద్యమించాలి..

- Advertisement -

నవతెలంగాణ- ఆర్మూర్ 
విద్యార్థుల సమస్యలపై ఉద్యమించాలని విద్యార్థి సేన జిల్లా సంయుక్త కార్యదర్శి వెంకటేష్ నాయక్ అన్నారు. మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ బీసీ హాస్టల్ లో శనివారం విద్యార్థి సేన నాయకుల కు శిక్షణ తరగతులు నిర్వహించారు..  ఆర్మూర్  డివిజన్  కమిటీ సభ్యులు నాయకులు  కార్యకర్తలకు  పాల్గొని ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థి సేన  లక్ష్యాల సిద్ధాంతాలు ఏ ఆశయకోసం ఏర్పడింది అనే అంశాల గురించి ,   విద్యార్థులు విద్యార్థి ఉద్యమాలపై విద్యార్థుల సమస్యలపై  ఎ విధంగా ఉద్యమించాలి అనే అంశాలపై వివరించినారు. విద్యార్థి సేన నాయకులు  భవిష్యత్తులో ఏ విధంగా ఉద్యమించాలి అనే అంశాలపై  శిక్షణ తరగతి వర్క్ షాప్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు.  భవిష్యత్తులో జిల్లా కేంద్రాలుగా పెద్ద ఎత్తున విద్యార్థుల సమస్యలపై  ఉద్యమం చేస్తామని రాష్ట్ర నాయకత్వం చెప్పిన నియమ నిబంధనలు ప్రతి ఒక్కటి పాటిస్తూ ఉద్యమాలు  చేస్తామని అన్నారు. ఈ వర్క్ షాప్ లో  మండల నాయకుడు వికాస్, అక్షయ్ లు ,బాల్కొండ నాయకులు నందకిషార్ ,జేశ్వంత్ ,మోర్తాడ్ నాయకులు దుర్గాప్రసాద్ ,హర్షవర్ధన్ ,భీముగల్ నాయకులు అభినయ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -