- Advertisement -
- – చెరువు కుంటల్లోకి చేరుతున్న వరద నీరు
– మత్తడికి సిద్ధంగా ఉన్న చెరువులు
నవతెలంగాణ -తాడ్వాయి - ఏజెన్సీలో గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు చెరువులు కుంటల్లోకి వరద నీరు భారీగా చేరింది. దీంతో చెరువులు కుంటలు జలకలను సంతరించుకున్నాయి. మండలంలోని కాటాపూర్ అన్నారం పెద్ద చెరువు, దామెరవాయి చెరువు, బీరెల్లి చెరువు, ఉప్పుకుంటా, జగ్గారం చెరువు, మేడారం చెరువు, ఇలా మండలంలోని అన్ని చెరువులు నిండుకుండలా మారాయి. ఏజెన్సీలోని జలగలంచ, మొండాలతోగు, నర్సాపూర్, పంబాపూర్ గ్రామాల వద్ద గల గౌరారం వాగు, గంగారం వద్ద వట్టివాగు, నీళ్ళవొర్రే, పడిగాపురం వద్ద బాంబులవొర్రే, అల్లిగూడెం నర్సాపురం(పి ఎల్) గ్రామాల వద్ద కిన్నెరసాని వాగులు పొంగిపొర్లుతున్నాయి. ఏజెన్సీ వ్యాప్తంగా గ్రామాల్లోని చెరువులు కుంటలు నిండుకుండలా దర్శనమిస్తున్నాయి. రైతులు ఖరీఫ్ సాగు సిద్ధమవుతున్నారు. నాకు వేసేందుకు కుమ్మరి ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఈ ప్రాంతంలో అత్యధిక వర్షపాతం నమోదు అవుతున్నట్లు అధికారులు వెల్లడించారు.
- Advertisement -