Sunday, July 27, 2025
E-PAPER
Homeఖమ్మంబీజేపీ నియంతృత్వాన్ని ఎదిరించే సత్తా వామపక్షాల కే ఉంది

బీజేపీ నియంతృత్వాన్ని ఎదిరించే సత్తా వామపక్షాల కే ఉంది

- Advertisement -
  • – రాజకీయాల్లో మార్పు అనివార్యం..
    – యువతే ఏ పార్టీకైనా వెన్నుముక…
    – సీపీఐ సీనియర్ నేత పువ్వాడ నాగేశ్వరరావు
    నవతెలంగాణ – అశ్వారావుపేట
  • రాజకీయాల్లో మార్పు అనివార్యం, అవసరమని, యువతే ఏ పార్టీకి అయినా పునాది అని భవిష్యత్ రాజకీయాలు నడిపేది యువకులే నని సీపీఐ(భారత కమ్యూనిస్ట్ పార్టీ) సీనియర్ నాయకులు,మాజీ ఎంఎల్సీ పువ్వాడ నాగేశ్వరావు అన్నారు. నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట లోని శ్రీశ్రీ కళ్యాణ మండపం( కామ్రేడ్ మియా జానీ నగర్) లో జరుగుతున్న పార్టీ  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 3 వ మహాసభలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరు అయ్యారు. మహాసభలు ప్రారంభం సూచికగా పార్టీ పతాకాన్ని ఎగురవేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రస్తుత  రాజకీయాల్లో మార్పులు  తప్పని సరిగా రావాలని,దేశ ఆర్థిక,సామాజిక పరిస్థితుల్లో గణనీయమైన పురోగతి సాధించాలంటే నేడు పాలిస్తున్న బీజేపీ( భారతీయ జనతా పార్టీ)నియంతృత్వానికి  అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించి  శతాబ్ధం కావస్తుంది అని,నాటి స్వతంత్రోద్యమం నుండి నేటి వరకు అనేక పోరాటాలు నిర్వహించిన ఘనత సిపిఐ కే ఉందన్నారు.ఈ తరం  యువత రాజకీయాల పట్ల అసక్తి కనబరిచి ప్రత్యక్ష రాజకీయాల్లో కి రావాలని సూచించారు.దేశ,రాష్ట్ర రాజకీయాల్లో వామపక్ష భావజాలం తో ముందుకు సాగాలని,ప్రజాతంత్ర లౌకిక  రాజ్యాన్ని స్థాపించాల్సిన  ఆవశ్యకత కమ్యూనిస్టుల భుజ స్కందాలపైనే ఉందన్నారు. ఈ అశ్వారావుపేట ప్రాంతంలో జమీందారీ,జాగీర్ధారి  వ్యవస్థలను రూపుమాపి ఎన్నో రైతాంగ, కార్మిక,కర్షక,పేద,మధ్యతరగతి ప్రజల కోసం ఉద్యమాలు చేసిన నాటి స్పూర్తితో నేటి నాయకత్వం ఆ దిశగా అడుగులు వేయాలని సూచించారు. సోయం గంగులు,సయ్యద్ మియా జానీ,ఊకే రామయ్య, చెన్నా రెడ్డి ఆధ్వర్యంలో అనేక భూ ఉద్యమాలు నిర్మించి ఎంతోమంది పేదలను రైతులు గా మార్చిన ఘనత సైతం భారత కమ్యూనిస్టు పార్టీ దే అన్నారు.ఆనాడు నిర్బంధాలు ఎన్ని ఎదురైనా  ధైర్యంగా పేదల పక్షం నిలబడ్డాం అని నాటి ఉద్యమ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.ఈ ప్రాంతం నాకు గత రోజులను గుర్తుకు తెస్తున్నాయి అని,ఈ విధంగా అందర్నీ కలవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.

భావోద్వేగానికి లోనైన పువ్వాడ : ప్రారంభ ఉపన్యాసం అనంతరం వెనుతిరిగి న పువ్వాడను తన వాహనం ఎక్కించేందుకు రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తో పాటు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు భాగం హేమంత రావు,జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్  పాషా, రాష్ట్ర కార్యవర్గసభ్యులు బొల్లోజు అయోధ్య, సిపిఐ అశ్వారావుపేట నియోజకవర్గం కార్యదర్శి సయ్యద్ సలీం వెళ్లారు.ఈ క్రమంలో ఒక్క సారిగా పువ్వాడ భావోద్వేగానికి గురికావడం తో అక్కడున్న  వారంతా కన్నీటి పర్యంతం అయ్యారు. పార్టీని బలంగా ముందుకు తీసుకెళ్లాలని భుజం తడుముతూ,కంటతడి తుడుచుకుంటూ పువ్వాడ బయలుదేరారు.
సమ సమాజాన్ని స్థాపించడం మే కమ్యూనిస్టుల ధ్యేయం… మరో వందేళ్లు ఐనా  ప్రజలు తోనే… బీజేపీ ది రాక్షస పాలన… కమ్యూనిస్టులు అంతా ఏకతాటిపైకి రావాలి… ఆపరేషన్ కగార్ ప్రభుత్వ నరమేధం… రాజ్యాంగ నిర్వీర్యం… కమ్యూనిస్టులు లేకుంటే  కాంగ్రెస్ కు అధికారమే లేదు… స్థానిక సమరం లో అవసరమైతే ఒంటరి పోరు: సిపిఐ జిల్లా మహాసభల్లో కూనంనేని

విశ్వ మానవులు అందరూ ఒక్కటే అని, సమ సమాజ స్థాపన,విశాల రాజ్యం  కోరుకునేది కమ్యూనిస్టులు మాత్రమేనని,కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంత పరమైన  విధానంతో సాగుతుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి,కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఉద్ఘాటించారు. భారత కమ్యూనిస్టు పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 3 వ మహాసభలు శనివారం  అశ్వారావుపేటనియోజకవర్గ కేంద్రంలోని మియా జానీ నగర్ (శ్రీశ్రీ కళ్యాణ వేదిక) లో పోటు ప్రసాద్, బందెల నర్సయ్య, ఏపూరి బ్రహ్మం, యార్లగడ్డ భాస్కర్ రావు, మెమోరియల్ హాల్లో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సీపీఐ ఆవిర్భవించి వందేళ్లు అవుతోందని, రానున్న మరో వందేళ్లు ఐనా  కూడా ప్రజలతో మమేకమై  ఉంటుందన్నారు.ఎన్నో పోరాటాలు,త్యాగాల తో పునీతమైన ఎర్రజెండా అజరామరం అని చెప్పారు.

ప్రజలకోసం, పేదల కోసం కమ్యూనిస్టు పార్టీ పుట్టిందని, కానీ నేడు దేశంలో ఉన్న చాలా  పార్టీలు అధికారం కోసం మాత్రమే పుట్టాయని చెప్పారు.సమాజం లో కారు చీకట్లలో కాంతిరేఖ గా ఉండేదే  కమ్యూనిస్టు పార్టీ అన్నారు. ప్రజల పక్షాన పనిచేసే కమ్యూనిస్టులను లేకుండా  చేయడం ఎవరివల్ల కాదని, కమ్యూనిజం సిద్ధాంతం  విశ్వవ్యాప్తం అని ప్రతిపాదించిన కారల్ మార్క్స్  ఆయనకు సహకరించిన  ఎంగెల్స్ అమలు చేసిన లెనిన్ ప్రపంచ మానవాళికి కొత్త వెలుగు నిచ్చారు అని అన్నారు. కమ్యూనిస్టుల అవసరం పెరుగుతోందని  ప్రపంచంలో సగం జనాభా  కమ్యూనిస్టుల  పాలన లోనే ఉన్నారని, దోపిడీ కి వ్యతిరేకంగా పురుడు పోసుకున్న కమ్యూనిస్టుల పోరాటాల ఫలితంగా నే అనేక చట్టాలు రూపొందాయని, క్షేమ పథకాలు అమలు అవుతున్నాయని అన్నారు.

కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బిజేపి ఆ చట్టాలను రద్దు చేసేందుకు ప్రయత్నిస్తుందని  మండిపడ్డారు. కార్మిక,కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలు  అమలు చేస్తున్న బీజేపికి బుద్ది  చెప్పేందుకు ఈ నెల  9 న దేశ వ్యాప్త సమ్మె  నిర్వహిస్తే కోట్లాది మంది రోడ్ల మీదికి వచ్చి నిరసన  తెలిపారని అన్నారు.  1964 లో కమ్యూనిస్టు ల్లో చీలికలు వచ్చాయని,ఇకనైనా అంతా ఏకతాటిపైకి వస్తే  రాజ్యాధికారం చేపట్టి దేశ ప్రజలకు మేలు చేయవచ్చని అన్నారు. కేంద్రంలోని బీజేపి సర్కార్ ఆపరేషన్ కగార్ తో మావోయిస్టులను హతం చేస్తుందని,గుడువు పెట్టి 2026 మార్చి 31 నాటికి దేశంలో మావోయిస్టులు లేకండా చేస్తామని చెప్పుకుంటు నర హత్యలకు పాల్పడుతున్నారని, మనిషిని చంపే హక్కు మీకు  ఎవరిచ్చారని ప్రశ్నించారు. శాంతి చర్చలు జరపాలంటూ అనేక ప్రతిపాదనలు  వస్తున్నప్పటికీ, మావోయిస్టు లే నేరుగా  లేఖలు రాస్తున్నప్పటికీ ఏ మాత్రం పట్టించుకోకుండా అధికార మదంతో రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తూ దేశంలో భయానక వాతావారణాన్ని సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మావోయిస్టు పార్టీతో ఇప్పటికైనా శాంతి చర్చలు జరిపి దేశంలో శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పాల ! .రాజ్యం బలంగా ఉందని, మావోయిస్టు పార్టీ కూడా ఈ దిశగా ఆలోచన చేసి తమ సిద్ధాంతాల్లో మార్పులు చేసుకోవాలని సూచించారు. సిపిఐని గెలిపించామంటూ కొందరు ప్రగల్బాలు పలుకుతున్నారని, కానీ గత ఎన్నికల్లో సిపిఐ లేకుండా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోనికి వచ్చేదా అని ప్రశ్నించారు. 118 స్థానాల్లో కాంగ్రెస్కు కమ్యూనిస్టులు మద్దతు తెలిపారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. అది మరిచిపోయి తామే కొత్తగూడెంలో గెలిపించామని జబ్బలు చరుచుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అనాటి రాజకీయ సమీకరణాలను బట్టి అవసరమైతే ఒంటిరి పోరుకు కూడా సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్టీ త్యాగాలను, సిద్ధాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి గ్రామగ్రామాన ఎర్రజెండా రెపరెపలాడేందుకు ప్రతీకార్యకర్త సైనికుల్లా పనిచేయాలని సూచించారు. ముత్యాల విశ్వనాధం, నరాటి ప్రసాద్, కల్లూరి వెంకటేశ్వరరావు, మున్నా లక్ష్మీ కుమారి, ఫయూం అధ్యక్ష తన జరిగనన ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్రకార్యదర్శి వర్గ సభ్యులు భాగం హేమంతరావు, జిల్లా కార్యదర్శి ఎస్ కే సాబీర్ పాషా, రాష్ట్ర కంట్రోల్ కమీషన్ చైర్మన్ ఎస్కే మౌలాన, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వాసిరెడ్డి సీతారామయ్య, ఖమ్మం జిల్లా కార్యదర్శి దండి సురేష్, జమ్ముల జితేందర్ రెడ్డి, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సయ్యద్ సలీం, ఏపి రాష్ట్ర కమిటీ సభ్యులు ఎండి మునీర్, దారయ్య, సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యవర్గ సభ్యులు కే సారయ్య, సరిరెడ్డి పుల్లారెడ్డి, రావులపల్లి రవికుమార్, చండ్రా నరేంద్ర, చలిగంటి శ్రీనివాస్, చంద్రగిరి శ్రీనివాస్, రేసు ఎల్లయ్య, దేవరకొండ శంకర్, కమటం వెంకటేశ్వరావు, దుర్గరాశి వెంకన్న, సింగరేణి కాలరీస్ వర్కర్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజ్కుమార్, గన్నెని రామకృష్ణ, అశ్వరావుపేట పట్టణ కార్యదర్శి నూకవరపు విజయ్ కాంత్, శింగు నర్సింహారావు, సీతామహాలక్ష్మీ, తాటి వెంకటేశ్వర్లు, సాయిబాబు, పూర్ణచంద్రరావు, రాహుల్, హరీష్, అజిత్తదితరులు పాల్గొన్నారు.

ప్రజా ఉద్యమాల వేదిక సిపిఐ – నెల్లికంటి : స్వాతంత్య్రానంతరం అనేక చారిత్రక పోరాటాలకు, ప్రజా ఉద్యమాలకు భారత కమ్యూనిస్టు పార్టీ వేదికంగా ఉందని ఈ నేపధ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆ ఉధ్యమాలకు ప్రతీకగా నిలిచిందని సిపిఐ రాష్ట్ర నాయకులు, శాసనమండలి సభ్యులు నెల్లికంటి సత్యం తెలిపారు. సిపిఐ మహాసభల్లో ఆయన మాట్లాడుతూ నాటి నుండి నేటి వరకు జాతీయోధ్యమం, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం మద్దతునిచ్చిన జాతీయ పార్టీగా సిపిఐ చరిత్ర పుటల్లో నిలిచిందన్నారు. తెలంగాణ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించిన దున్నేవాడిదే భూమి అంటూ లక్షలాది ఎకరాల భూములను పేదలకు పంచిన చరిత్ర సిపిఐ సొంతం అన్నారు. బిజేపి మతపరమైన రాజకీయాలు చేస్తోందని, మతాలను అడ్డు పెట్టుకుని కులాల మధ్య చిచ్చు పెడుతోందని, రాముని పేరుతో ఓట్ల రాజకీయాలు చేస్తున్న బిజేపిని అయోధ్యలో ప్రజలు చిత్తుగా ఓడించారని యద్దేవా చేశారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా, కార్పోరేట్ శక్తులకు అనుకూలంగా బిజేపి పాలన కొనసాగిస్తోందని, బిజేపి కుట్రలు, మతోన్మాదం, కార్పోరేటీకరణకు వ్యతిరేకంగా పోరాడాలని నెల్లికంటి పిలుపునిచ్చారు. పదేళ్ల పాటు నియంత పాలన సాగించిన బిఆర్ఎస్ను ప్రజలు ఇంటికి పంపారని, కేసిఆర్ను ఫాం హౌస్క పరిమితం చేశారని చెప్పారు. సామ్రాజ్యవాద వ్యతిరేకవిధానాలకు ఆనాడే సిపిఐ పోరాటం చేసిందని, ఆ పార్టీకి పోరాటాలు కొత్తకాదని, రాబోయే రోజుల్లో దేశంలో, రాష్ట్రంలో సమానత్వం కోసం మరిన్ని ఉధ్యమాలు చేపడతామన్నారు. ఎందరో త్యాగధనుల రక్తంతో ఎరుపెక్కిన ఎర్రజెండా భద్రాద్రి జిల్లా పోరాటాలకు కేంద్రబింధువుగా నిలించిందన్నారు.26,27 తేదీలలో జరిగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మూడో మహాసభలను విజయవంతం చేయాలని సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్.కె సాబీర్ భాష మరియు మూడవ జిల్లా మహాసభ అధ్యక్షులు సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సయ్యద్ సలీం సిపిఐ పార్టీ శ్రేణులను కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -