Sunday, July 27, 2025
E-PAPER
Homeబీజినెస్బ్రిటన్‌తో ఒప్పందం అన్ని వర్గాలకు ప్రయోజనం

బ్రిటన్‌తో ఒప్పందం అన్ని వర్గాలకు ప్రయోజనం

- Advertisement -

– మంత్రి పీయూశ్‌ గోయల్‌
న్యూఢిల్లీ :
బ్రిటన్‌తో భారత్‌ చేసుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అన్ని వర్గాలకు ప్రయోజనాన్ని చేకూర్చనుందని వాణిజ్య శాఖ మంత్రి పీయూశ్‌ గోయల్‌ అన్నారు. ఇది ఇరు దేశాలకు గేమ్‌ ఛేంజింగ్‌ లాంటిదన్నారు. ఈ ఒప్పందంతో రైతులు, యువత, ఎంఎస్‌ఎంఈ రంగం, పరిశ్రమలకు ప్రయోజనం చేకూరుస్తుందన్నారు. శనివారం న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి పీయూశ్‌ గోయల్‌ మాట్లాడుతూ.. రాబోయే సంవత్సరాల్లో దీని ప్రయోజనాలను అందరూ చూస్తారన్నారు. ఈ ఒప్పందం ద్వారా భారత్‌ తన 99 శాతం ఎగుమతులను యూకేకు సుంకాలు లేకుండా రవాణా చేయగలదని గోయల్‌ పేర్కొన్నారు. వ్యవసాయం, ఇథనాల్‌ వంటి సున్నితమైన అంశాలను రక్షిస్తూ ఒప్పందంలో సంతకాలు చేశామన్నారు. యూపీఏ పాలనలో మార్కెట్లను తెరిచిన తీరు దేశానికి హాని కలిగించిందని మంత్రి అన్నారు. ఈ ఒప్పందం యూకే పార్లమెంట్‌ ఆమోదం పొందిన వెంటనే అమలులోకి వస్తుందన్నారు. ఫుట్‌వేర్‌, లెదర్‌, బొమ్మలు, ఫార్మాస్యూటికల్స్‌, రత్నాలు, ఆభరణాలు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, సేవల రంగాల్లో మార్కెట్‌ అవకాశాలను అన్వేషించాలని భారత పరిశ్రమలకు మంత్రి సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -