Sunday, July 27, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంమతతత్వ శక్తుల నుంచి దేశాన్ని కాపాడుకుందాం

మతతత్వ శక్తుల నుంచి దేశాన్ని కాపాడుకుందాం

- Advertisement -

– సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మల్లు లకిë
– వివిధ పార్టీల నుంచి 30 కుటుంబాలు సీపీఐ(ఎం)లో చేరిక
నవతెలంగాణ-కోదాడటౌన్‌

దేశంలో 11 ఏండ్ల కాలంలో బీజేపీ ప్రభుత్వం, మతోన్మాద శక్తులు మతతత్వ రాజకీయాలతో ప్రజల మధ్య చీలికలు తెస్తున్నాయని, వారి నుంచి దేశాన్ని కాపాడుకుందామని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మల్లు లకిë అన్నారు. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండల కేంద్రంలో శనివారం నిర్వహించిన సీపీఐ(ఎం) రాజకీయ శిక్షణా తరగతుల్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిరిపురం, గోపాలపురం గ్రామాలకు చెందిన వివిధ రాజకీయ పార్టీల నుంచి 30 కుటుంబాలు సీపీఐ(ఎం)లో చేరాయి. వారికి మల్లు లకిë పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం ఆమె మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్‌రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ములకలపల్లి రాములు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -