నవతెలంగాణ – బజార్ హాత్నూర్:
మండలకేంద్రానికి చెందిన బొప్పరపు అశోక్ (37) అనే యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. స్థానిక ఎస్ఐ సంజయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన బొప్పరపు అశోక్ ప్రయివేట్ ఉద్యోగం చేస్తూ.. కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. అయితే చాలా రోజుల నుంచి తీవ్రమైన కడుపు నొప్పితో బాధ పడుతున్నాడు. ఈక్రమంలో నొప్పి భరించలేక క్షణికావేశంలో ఈ నెల 15న తన ఇంట్లో పురుగుల మందు తాగి, ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
వెంటనే అప్పమత్తమైన ఆయన భార్య, కుటుంబ సభ్యులు అతనిని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడినుంచి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ లోని రిమ్స్ కు తరలించారు. అక్కడ దాదాపు 3 రోజుల పాటు చికిత్స అందించారు. అయినా ఆరోగ్యం మెరుగు పడకపోవడంతో అక్కడి నుండి జిల్లా కేంద్రంలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రికి తీసుకు వెళ్ళారు. కాగా.. తొమ్మిది రోజుల పాటు చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం 07:00 సమయంలో మృతి చెందాడని కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుని భార్య, తమ్ముడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.
పురుగుల మందు తాగి.. చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES